వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మందుబాబులు జాగ్రత్త: మందు కొట్టి 30లక్షల మంది చనిపోయారట

|
Google Oneindia TeluguNews

మద్యం సేవించే మందుబాబులకు ఇది కచ్చితంగా చేదు వార్తే అవుతుంది. చేదువార్తే కాదు ఇది చదివాకా మనస్సు మార్చుకోవాల్సిందే. 2016వ సంవత్సరంలో కేవలం మందుకొట్టి ప్రపంచవ్యాప్తంగా 30 లక్షలు మంది చనిపోయినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ప్రతి 20 మరణాల్లో ఒకటి మద్యం సేవించడం కారణంగానే జరిగిందని నివేదిక పేర్కొంది.

 మద్యం సేవించి మృతి చెందిన వారిలో పురుషులే అధికం

మద్యం సేవించి మృతి చెందిన వారిలో పురుషులే అధికం

గ్లోబల్ స్టేటస్ రిపోర్ట్ ఆర్ ఆల్కహాల్ అండ్ హెల్త్ 2018 పేరుతో సెప్టెంబర్ 21న ఐక్యరాజ్యసమితి ఒక నివేదికను విడుదల చేసింది. రష్యా, మోల్డోవా, బెలారస్ దేశాల్లో మద్యం సేవించే వారి సంఖ్య గత పదేళ్లతో పోలిస్తే తగ్గుముఖం పట్టిందని నివేదిక వెల్లడించింది. మద్యం కారణంగా ప్రపంచవ్యాప్తంగా చనిపోయినవారిలో పురుషులే అధికంగా ఉన్నట్లు రిపోర్ట్ పేర్కొంది.

మద్యం సేవించడం వల్ల కుటుంబంలో కలహాలు ఆపై మరణాలు

మద్యం సేవించడం వల్ల కుటుంబంలో కలహాలు ఆపై మరణాలు

మద్యం సేవించి కుటంబంలో అలజడి సృష్టించడం దాని ద్వారా ఎమోషన్స్ ఆపుకోలేక హింసలకు పాల్పడటం, ఆపై చంపడాలు లేదా చావడాలు జరుగుతున్నాయని రిపోర్ట్ పేర్కొంది. మద్యం ఎక్కువగా సేవించడం వల్ల క్యాన్సర్ ఇతరత్రా ఆరోగ్య సమస్యలు వచ్చి చాలా మంది మృతి చెందుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రాస్ అద్నామ్ చెప్పారు.

రోడ్డు ప్రమాదాల్లోనే ఎక్కువ మరణాలు

రోడ్డు ప్రమాదాల్లోనే ఎక్కువ మరణాలు

మద్యం సేవించిన కారణంగా జరిగే మరణాలు ఎక్కువగా అంటే 28 శాతాలు రోడ్డు ప్రమాదాల్లో గాయపడటం వల్ల, 21 శాతం జీర్ణవ్యవస్థలో సమస్యల వల్ల, 19శాతం శ్వాసకోశ సమస్యల వల్ల, మిగతా శాతం ఇన్ఫెక్షన్, క్యాన్సర్, ఇతరత్ర జబ్బులతో జరుగుతున్నవని డాక్టర్ టెడ్రాస్ తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా 237 మిలియన్ పురుషులు, 46 మిలియన్ స్త్రీలు మద్యానికి బానిసలై ఆరోగ్య సమస్యలు కొనితెచ్చుకుంటున్నారని...ఇది ఎక్కువగా యూరోపియన్ దేశాల్లో కనిపిస్తోందని రిపోర్ట్ వెల్లడించింది. 2.3 బిలియన్ మంది ప్రజలు మద్యం సేవిస్తారని అందులో అమెరికా, యూరప్, పాశ్చాత్య పసఫిక్ దేశాలకు చెందిన ప్రజలు అధికంగా మద్యం సేవిస్తున్నట్లు రిపోర్ట్ నిగ్గు తేల్చింది.

రష్యాలో మందు కొట్టడం గత పదేళ్లతో పోలిస్తే తగ్గుముఖం

రష్యాలో మందు కొట్టడం గత పదేళ్లతో పోలిస్తే తగ్గుముఖం

ఇక గతపదేళ్లతో పోలిస్తే మద్యం సేవించడంలో తగ్గుముఖం పట్టిన దేశాల్లో రష్యా (2005లో 18.7లీటర్ల నుంచి 2016కు 11.7 లీటర్లకు పడిపోయింది ) ఉండగా, మోల్డోవా (2005లో 21.6 లీటర్ల నుంచి 2016కు 15.1 లీటరుకు పడిపోయింది), బెలారస్ (2005లో 15.3 లీటర్ల నుంచి 2016కు 11.2 లీటర్లకు పడిపోయింది) దేశాలు వరుసగా నిలిచాయి. ఇదిలా ఉంటే ఏదైనా వేడుకల సమయంలో 60 గ్రాములు లేదా అంతకంటే ఎక్కువగా ఉన్న ప్యూర్ ఆల్కహాల్ సేవిస్తున్న వారిలో రష్యాదేశం ముందు వరసలో ఉన్నట్లు నివేదిక స్పష్టం చేసింది. ఇక యావరేజ్‌గా రోజు మద్యం సేవించే వారు 33 గ్రాముల ఆల్కహాల్ తీసుకుంటున్నట్లు చెప్పిన నివేదిక.. 150 మిల్లీలీటర్ గ్లాస్ వైన్, 750 మిల్లీలీటర్ బాటిల్ బీర్, 40 మిల్లీలీటర్ స్పిరిట్ షాట్స్ తీసుకుంటున్నట్లు నివేదిక వెల్లడించింది.

English summary
The harmful use of alcohol killed more than 3 million people in 2016, representing 1-in-20 deaths worldwide, a new study by the World Health Organization (WHO) says.The Global Status Report on Alcohol and Health 2018, published on September 21 by the Geneva-based UN organization, also said that drinking rates in countries such as Russia, Moldova, and Belarus show signs of decline over the past decade.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X