వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విషాదం: ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం, 41 మంది మృతి

By Narsimha
|
Google Oneindia TeluguNews

మిర్యాంగ్: దక్షిణ కొరియాలోని ఓ ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం సంబవించింది. ఈ ఘటనలో సుమారు 41 మంది రోగులు మృతి చెందారు. ప్రఖ్యాత మిర్యాంగ్‌ నగరంలోని సెజాంగ్‌ ఆస్పత్రిలో శుక్రవారం ఉదయం ఈ ఘటన జరిగింది. ఆస్పత్రి ఎమర్జెన్సీ వార్డులో చెలరేగిన మంటలు.. నిమిషాల్లోనే ఆరంతస్తుల భవనాన్ని బూడిద చేశాయని అధికారులు ప్రకటించారు

ఈ ప్రమాదంలో 41 మంది చనిపోయారు. మరో 60 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రుల్లో 16 మంది పరిస్థితి విషమంగా ఉందని అని అధికారులు తెలిపారు. ప్రమాద సమయంలో సుమారు 200 మంది రోగులు ఆస్పత్రిలో ఉన్నారని అధికారులు ప్రకటించారు.

31 dead in South Korea hospital blaze

ఆసుపత్రిలోని రెండో అంతస్థులో మంటలు చేలరేడి అన్ని అంతస్థులకు వ్యాపించాయి.ఈ అంతస్థులోని రోగులందరినీ బయలకు తీసుకొచ్చే ప్రయత్నంలో సఫలం కాలేకపోయినట్టు అధికారులు తెలిపారు. 100 మందిని సురక్షితంగా బయటికి తీసుకొచ్చినట్టు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.. సెజాంగ్‌ నుంచి బయటికి తీసుకొచ్చిన రోగులను సమీపంలోని ఇతర ఆస్పత్రుల్లో చేర్పించి చికిత్స అందిస్తున్నారు.

సెజాంగ్‌ ఆస్పత్రిలో ఘోర ప్రమాద ఘటనపై దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్‌ జే ఇన్‌ విచారం వ్యక్తం చేశారు. సమాచారం అందిన వెంటనే.. అందుబాటులో ఉన్న అధికారులతో ఎమర్జెన్సీ మీటింగ్‌ నిర్వహించారు. సహాయకార్యక్రమాలు ముమ్మరం చేయాలని ఆదేశించారు.

2008 నాటి సబ్‌వేస్టేషన్‌ అగ్నిప్రమాదం తర్వాత దక్షిణ కొరియాలో చోటుచేసుకున్న ఘోర ప్రమాదం సెజాంగ్‌ ఆస్పత్రిదే కావడం గమనార్హం. నాటి సబ్‌వే ప్రమాదంలో 192 మంది ప్రాణాలుకోల్పోయారు.

English summary
At least 31 people were killed in a blaze at a hospital in South Korea today, Yonhap news agency said, with dozens more injured.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X