వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కంటైనర్ లో 39 మృతదేహాలు..కుళ్లిపోయిన స్థితిలో: పోలీసుల అదుపులో డ్రైవర్

|
Google Oneindia TeluguNews

లండన్: ఓ కంటైనర్ లో 39 మృతదేహాలు లభించిన ఘటన కలకలం రేపింది. కుళ్లిపోయిన స్థితిలో ఉన్న మృతదేహాలతో కూడిన కంటైనర్ ఓ పారిశ్రామిక వాడలో కనిపించడం ప్రకంపలను రేపింది. రసాయనిక పరిశ్రమలు పెద్ద సంఖ్యలో ఉన్న పారిశ్రామికవాడ కావడం వల్ల పలు అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. ఇంగ్లాండ్ లోని ఎస్సెక్స్ కంట్రీలో ఈ ఘటన చోటు చేసుకుంది.
నంబర్ ప్లేట్ ఆధారంగా- మృతదేహాలు ఉన్న కంటైనర్ బల్గేరియాలో రిజిస్టర్ అయినట్లు పోలీసులు నిర్ధారించారు. కంటైనర్ డ్రైవర్ ను ఎస్సెక్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

 39 bodies found inside lorry container in Englands Essex

బల్గేరియాలో రిజిస్టయినట్లు చెబుతోన్న లండన్ సమీపంలోని థర్రోక్ నుంచి 400 కిలోమీటర్ల దూరంలో ఉన్న . మార్గ మధ్యలో ఎస్సెక్స్ స్టేట్ గ్రేస్ థర్రోక్ లోని వాటర్ గ్లేడ్ పారిశ్రామిక వాడలో కనిపించింది. అనుమానాస్పద స్థితిలో పార్క్ చేసి ఉండటం, అందులో నుంచి దుర్వాసన వస్తుండటాన్ని గుర్తించిన స్థానిక కార్మికులు ఈ విషయాన్ని పోలీసులకు తెలియజేశారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు కంటైనర్ ను పార్క్ చేసి ఉంచిన ప్రదేశానికి చేరుకున్నారు. కంటైనర్ ను తెరిచి చూడగా.. అందులో 39 మృతదేహాలు కనిపించాయి.

 39 bodies found inside lorry container in Englands Essex

ఆ వెంటనే డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు. ఐర్లాండ్ కు చెందిన డ్రైవర్ కొంతకాలంగా ఓ ట్రాన్స్ పోర్ట్ కార్యాలయంలో పనిచేస్తున్నట్లు తేలింది. శనివారం నాటికి హోలిహెడ్ కు చేరుకోవాల్సి ఉందని పోలీసులు వెల్లడించారు. మృతదేహాల గురించి ప్రశ్నించగా తనకేమీ తెలియదని చెబుతున్నాడని, విచారణ కొనసాగుతోందని ఎస్సెక్స్ పోలీస్ చీఫ్ సూపరింటెండెంట్ ఆండ్రూ మ్యారినేర్ తెలిపారు. ఇంత భారీగా మృతదేహాలు లభించడం పోలీసులను సైతం దిగ్భ్రాంతికి గురి చేస్తోంది. దాదాపు అన్ని వయస్కుల వారి మృతదేహాలు ఉన్నాయని, సామూహిక హత్యలుగా ప్రాథమికంగా నిర్ధారించినట్లు పోలీసులు వెల్లడించారు.

ఇంత పెద్ద సంఖ్యలో మృతదేహాలు లభించడంపై బ్రిటన్ ప్రభుత్వం ఉలిక్కి పడింది. ఆ దేశ హోం కార్యదర్శి, భారత సంతతికి చెందిన ప్రీతి పటేల్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని ఆమె ఎస్సెక్స్ పోలీసులకు ఆదేశించారు. ఈ మేరకు ఓ ట్వీట్ చేశారు. ఎస్సెక్స్ స్టేట్ అత్యున్నత పోలీసులు, ఫోరెన్సిక్ నిపుణులు గ్రేస్ వాటర్ హెడ్ పారిశ్రామిక వాడకు చేరుకుని, దర్యాప్తు చేపట్టారు. కంటైనర్ ను సీజ్ చేశారు. మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు. పోస్ట్ మార్టమ్ నిర్వహించిన తరువాతే.. మరణానికి గల అసలు కారణం తేలుతుందని పోలీసులు స్పష్టం చేశారు.

English summary
The British police have launched a murder investigation after 39 people – 38 adults and one teenager – were found dead in a lorry container early on Wednesday morning in an incident likely to be related to human smuggling. The Essex police said they were called by colleagues from the ambulance service shortly before 1.40 am following the discovery of a lorry container with people inside at Waterglade Industrial Park, Eastern Avenue, Grays. The 39 people were pronounced dead at the scene.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X