వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మెక్సికోలో కాల్పుల కలకలం: అధ్యక్ష భవనం సమీపంలో ఫైరింగ్, నలుగురి మృతి, పలువురికి గాయాలు..

|
Google Oneindia TeluguNews

సాయుధుడైన దుండగుడు మెక్సికోలో రెచ్చిపోయాడు. అధ్యక్ష భవనం నేషనల్ ప్యాలెస్ సమీపంలో గల భవనంలో చొరబడ్డాడు. అతనిని నిలదీస్తే కాల్పుల మోత మోగించాడు. దీంతో ముగ్గురు పౌరులు మృతిచెందారు. మరో ఇద్దరు గాయపడ్డారు. వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు.

మెక్సికో సిటీలో శనివారం ఘటన కలకలం రేగింది. దుండగుడు పిస్టోల్‌తో బీభత్సం సృష్టించాడు. దుండగుడు కాల్పులు జరిపే సమయంలో అధ్యక్షుడు ఆండ్రెస్ మాన్యువల్ లోపెజ్ ఒబ్రాడోర్ భవనంలో లేరు. పర్యటన నిమిత్తం బయటకు వెళ్లారు. ఓ చిన్న భవనంలో దుండగుడు వెళ్లాడు. అయితే అక్కడ కొందరు అతనిని ప్రశ్నించడంతో కాల్పులు జరిపాడు.

4 dead in shooting near Mexicos presidential residence

అతని చేతిలో పిస్టోల్ గమనించిన కొందరు తుపాకీ వదిలేయని చెబితే కాల్పులు జరపడం ప్రారంభించాడు. ఘటనాస్థలంలోనే ఇద్దరు కుప్పకూలిపోయారు. మరో ముగ్గురిని ఆస్పత్రికి తరలించారు. అందులో ఒకరు మార్గమధ్యలోనే చనిపోయారు. వెంటనే ఘటనాస్థలంలోకి 100 మంది పోలీసులు వచ్చారు. వారు జరిపిన కాల్పుల్లో ముష్కరుడు చనిపోయాడు. తర్వాత వీధుల్లో తనిఖీలు చేపట్టారు. ముష్కరుడు చొరబడ్డ భవనం చాలా సన్నగా ఉంటుందని.. ఆ వీధుల్లో ప్రభుత్వ అధికారులు, రిపోర్టర్లకు మాత్రమే నడుస్తారని పేర్కొన్నారు.

English summary
four people were killed and two injured in a shooting on Saturday near Mexico's National Palace, the presidential residence in the capital's historic downtown, officials said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X