వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బిగ్ సిస్టర్: ఒక్క ఫోన్ కాల్‌తో తల్లిని కాపాడుకున్న చిన్నారి

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: ఓ నాలుగేళ్ల చిన్నారి సమయ స్ఫూర్తితో వ్యవహరించి తన తల్లిని కాపాడుకోగలిగింది. అమెరికాలో జరిగిన ఈ ఘటనతో ఆమె మీడియాలో పెద్ద సంచలనమైంది. వివరాల్లోకి వెళితే.. అమెరికాలోని మిచిగాన్ కలమజు ప్రాంతానికి చెందిన కలైజ్ మానింగ్ అనే నాలుగేళ్ల చిన్నారి ఒక్క ఫోన్ కాల్ చేసి తన తల్లిని కాపాడుకుంది.

తొమ్మిది నెలలు నిండిన తన తల్లి సెంటిరీయా పురిటి నొప్పులతో బాధపడుతుంటే.. ఆ చిన్నారి కలైజ్ వెంటనే అత్యవసర సేవల విభాగం సర్వీస్ నెంబర్ 911కు ఫో చేసింది. ‘మా అమ్మ కిందపడిపోయి విలవిల్లాడిపోతోంది. ఆమె తొందరలో పిల్లాడిని ప్రసవించనుంది. ఆమెకు వెంటనే సహాయం కావాలి' అని ఫోన్లో చెప్పింది.

4-year old calls 911, saves pregnant mother and becomes a big sister

కలైజ్ ఫోన్ కాల్‌కు వెంటనే స్పందించి రంగంలోకి దిగిన సిబ్బంది సెంటిరీయాను ఆస్పత్రికి తరలించి ఆమె ప్రాణాలు కాపాడారు. ఆమెకు ఓ బాబు జన్మించాడు. తల్లీ, కొడుకు ఇద్దరూ క్షేమంగా ఉన్నారని ఆస్పత్రి వైద్యులు తెలిపారు.

కాగా, సమయ స్ఫూర్తితో వ్యవహరించి తన ప్రాణాలను కాపాడిన తన కూతురు కలైజ్‌ను చూసి సెంటిరీయా ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేసింది. తనకు బుల్లి తమ్ముడు రావడంతో ‘ఐ యామ్ ది బిగ్ సిస్టర్' అనే అక్షరాలతో కూడిన టీ షర్టును ధరించిన కలైజ్ మురిసిపోయింది. ఇది ఇలా ఉండగా విపత్కర పరిస్థితుల్లో తెలివిగా వ్యవహరించిన కలైజ్‌కు అవార్డు ఇవ్వాలని ప్రతిపాదిస్తున్నట్లు సేవల విభాగానికి చెందిన ఒకరు తెలిపారు.

English summary
Calise Manning is being called a hero for helping her pregnant mother and calling 911 operators in Kalamazoo, Michigan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X