India
  • search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పోర్న్ సైట్స్ నిర్వహించే ఆ సంస్థపై రూ. 290 కోట్ల భారీ పరువునష్టం దావా వేసిన 40 మంది మహిళలు

|
Google Oneindia TeluguNews

బాగా పాపులర్ అయిన పోర్న్ వెబ్‌సైట్‌ పోర్న్ హబ్ ను నడుపుతున్న మాంట్రియల్‌కు చెందిన సంస్థపై కాలిఫోర్నియాలోని 40 మంది మహిళలు కేసు పెట్టారు . తమ పూర్తి అనుమతి లేకుండా వారి అశ్లీల వీడియోలను సైట్ లో ఉంచి సైట్ లాభం ఆర్జిస్తున్నదంటూ వారు సదరు వెబ్ సైట్ పై పరువు నష్టం దావా వేశారు. కెనడాకు చెందిన ప్రముఖ పోర్న్ కంపెనీ అయిన పోర్న్ హబ్ యొక్క మాతృ సంస్థ మైండ్ గీక్ పై యు.ఎస్. డిస్ట్రిక్ట్ కోర్టులో మంగళవారం ఈ వ్యాజ్యం దాఖలైంది .

కపుల్ ఛాలెంజ్,బ్యూటీఫుల్ డాటర్ ఛాలెంజ్..ఆ ఫోటోలు మార్ఫ్ చేసి అశ్లీల సైట్లలో..సైబర్ క్రైం హెచ్చరికకపుల్ ఛాలెంజ్,బ్యూటీఫుల్ డాటర్ ఛాలెంజ్..ఆ ఫోటోలు మార్ఫ్ చేసి అశ్లీల సైట్లలో..సైబర్ క్రైం హెచ్చరిక

 నిబంధనలకు విరుద్ధంగా తమ వీడియోలను కంపెనీ ఆన్లైన్ లో పెట్టిందని ఆరోపణలు

నిబంధనలకు విరుద్ధంగా తమ వీడియోలను కంపెనీ ఆన్లైన్ లో పెట్టిందని ఆరోపణలు

ఈ పిటీషన్లో మహిళలు సంస్థ నిబంధనలకు విరుద్ధంగా తమ వీడియోలను కంపెనీ ఆన్లైన్ లో పోస్ట్ చేస్తుందని ఆరోపించారు . తమ అంగీకారం లేకుండా ఆన్లైన్ లో తమ వీడియోలను పోస్ట్ చేయకూడదనే నిబంధనను కంపెనీ అతిక్రమించిందని వారు కోర్టు దృష్టికి తీసుకు వెళ్లారు. తమ వీడియోలను తొలగించమని విన్నవించినా పట్టించుకోలేదంటూ మైండ్ గీక్ సంస్థ చేసిన పని వల్ల తమ పరువు నష్టం కలిగింది అంటూ వారు వ్యాజ్యం వేశారు.

తమకు చెప్పకుండా వీడియోలు పోస్ట్ చెయ్యటం వల్ల మానసిక , శారీరక ,ఆర్ధిక నష్టం అన్న మహిళలు

తమకు చెప్పకుండా వీడియోలు పోస్ట్ చెయ్యటం వల్ల మానసిక , శారీరక ,ఆర్ధిక నష్టం అన్న మహిళలు

తమ వీడియోలను తమకు చెప్పకుండా, తమ అనుమతి తీసుకోకుండా ఆన్లైన్ లో పోస్ట్ చేయడం వల్ల తాము చెప్పలేని మానసిక వేదనకు గురయ్యామని , ఆర్థికంగా నష్ట పోయామని, బయట శారీరకంగాను ఇబ్బందులకు గురి అయ్యామని వారు పేర్కొన్నారు. 40 మంది మహిళలు సదరు కంపెనీ నుండి ఒక్కొక్కరికి మిలియన్ డాలర్ల చొప్పున మొత్తం 40 మిలియన్ డాలర్లను పరువు నష్టం కింద అందించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

 గతంలోనూ ఈ పోర్న్ సైట్ పై అనేక ఆరోపణలు

గతంలోనూ ఈ పోర్న్ సైట్ పై అనేక ఆరోపణలు

గతంలోనూ ఈ సంస్థ అనేక ఆరోపణలు ఎదుర్కొన్నట్టు సమాచారం . 2019 లో ఆ సంస్థ యొక్క ఆపరేటర్లను యు.ఎస్. అధికారులు నేరారోపణ చేసే వరకు మైండ్‌గీక్ గర్ల్స్ ది పోర్న్‌తో తన భాగస్వామ్యాన్ని ముగించలేదని ఆరోపించారు. మైండ్‌గీక్ యాజమాన్యంలోని వెబ్‌సైట్లు వాటిలో కనిపించిన మహిళలు అభ్యంతరం వ్యక్తం చేసినప్పుడు కూడా వీడియోలను తొలగించలేదని గతంలో పలు సందర్భాల్లో నిరూపితమైంది. అంతేకాదు గతంలో చిన్న పిల్లలకు సంబంధించిన వీడియోల విషయంలో కూడా ఈ సైట్ పలు వివాదాలు ఎదుర్కొంది.

 40 మంది మహిళలు వేసిన ఈ వ్యాజ్యంలో సుమారు రూ. 290 కోట్ల భారీ పరువునష్టం డిమాండ్

40 మంది మహిళలు వేసిన ఈ వ్యాజ్యంలో సుమారు రూ. 290 కోట్ల భారీ పరువునష్టం డిమాండ్

ఈ కారణంగా ధృవీకరించని వినియోగదారుల నుండి అప్‌లోడ్ చేసిన అన్ని కంటెంట్‌లను పోర్న్‌హబ్ తొలగిస్తుంది.
మైండ్‌గీక్ చట్టబద్దంగా నిర్వహించాల్సిన ప్రధాన కార్యాలయం లక్సెంబర్గ్‌లో ఉండగా, దాని ప్రధాన కార్యాలయం మాంట్రియల్‌లో ఉంది. ఈ సంస్థ ఇంటర్నెట్‌లో అత్యంత ప్రాచుర్యం పొందిన సైట్‌లలో ఒకటైన పోర్న్‌హబ్‌తో సహా డజన్ల కొద్దీ అశ్లీల వెబ్‌సైట్‌లను నిర్వహిస్తోంది. 40 మంది మహిళలు వేసిన ఈ వ్యాజ్యం $ 40 మిలియన్లకు పైగా నష్టపరిహారాన్ని కోరుతూ వేయబడింది. ఇక దీనిపై ఇప్పటివరకు మైండ్ గీక్ సంస్థ స్పందించకపోవడం గమనార్హం.

English summary
A popular porn website is being sued by 40 women in California who claim it continues to profit from pornographic videos of them that were published without consent. The lawsuit, filed in a U.S. district court , $40 million US in damages.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X