వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

400 ఏళ్ల గ్రీన్‌లాండ్ షార్క్... ఆర్కిటిక్ మహాసముద్రంలో అత్యంత పురాతన జీవి....

|
Google Oneindia TeluguNews

దాదాపు 393 సంవత్సరాల వయసున్న ఓ సొరచేపను ఆర్కిటిక్ మహాసముద్రంలో గుర్తించారు. 1627వ సంవత్సరంలో పుట్టిన ఈ గ్రీన్‌లాండ్ సొరచేప(greenland shark) భూమిపై ఉన్న అత్యంత పురాతన జీవుల్లో ఒకటి. సాధారణంగా గ్రీన్‌లాండ్ సొరచేపలు 400 ఏళ్ల పాటు బతుకుతాయని పరిశీలకులు చెప్తున్నారు. మానవ జీవిత కాలాన్ని కూడా ఎక్కువ కాలం ఎలా పొడగించవచ్చో తెలుసుకునేందుకు వీటిల్లో ఏవైనా ఆధారాలు దొరకవచ్చునని జన్యు శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.

పరిశోధకులు ఏమంటున్నారు...

పరిశోధకులు ఏమంటున్నారు...

బ్రిటన్‌లోని కోస్తా తీరంలోనూ కనిపించే ఈ గ్రీన్‌లాండ్ సొరచేపలను ఆర్కిటిక్ యూనివర్సిటీ ఆఫ్ నార్వే పరిశోధకులు జన్యుపరంగా విశ్లేషించే ప్రయత్నాలు చేస్తున్నారు. గ్రీన్‌లాండ్ సొరచేపల అసాధారణ సుదీర్ఘ జీవితాలకు కారణమైన జన్యువులను గుర్తించి... వాటిని వేరు చేసేందుకు పరిశోధకులు ప్రయత్నిస్తున్నారు. తద్వారా మానవుల ఆయుర్దాయ పరిమితులను తెలుసుకోవచ్చునని భావిస్తున్నారు. అంతిమంగా.. మానవ జీవితాన్ని సుదీర్ఘ కాలం పొడగించడంలో ఈ పరిశోధనలు దోహదపడుతాయని జన్యుశాస్త్ర నిపుణులు చెప్తున్నారు.

జన్యు క్రమాన్ని విశ్లేషించే ప్రయత్నం...

'ప్రస్తుతం మేము గ్రీన్‌లాండ్ సొరచేపల న్యూక్లియర్ జన్యు క్రమాన్ని పూర్తిగా విశ్లేషిస్తున్నాం. ఇతర జంతువుల కంటే ఇది ఎక్కువ కాలం ఎలా జీవించగలదో.. ఎందుకు ఇది మాత్రమే సుదీర్ఘ జీవిత కాలాన్ని కలిగి ఉందో పరిశోధనల్లో వెల్లడయ్యే అవకాశం ఉంది.' అని ఆర్కిటిక్ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ కిమ్ ప్రెబెల్ తెలిపారు. ఈ అంతుచిక్కని జాతుల బయాలజీ గురించి మరింత అర్థం చేసుకోవడానికి పరిశోధన ఫలితాలు దోహదపడుతాయని చెప్పారు.

Recommended Video

Viral Video : A Seabird Cormorant Eating Fish Will Give You Goosebumps
ఆర్కిటిక్,అట్లాంటిక్ సముద్రాల్లో గ్రీన్‌లాండ్ షార్క్స్...

ఆర్కిటిక్,అట్లాంటిక్ సముద్రాల్లో గ్రీన్‌లాండ్ షార్క్స్...

గ్రీన్‌లాండ్ షార్క్ జీవశాస్త్రం, జన్యుశాస్త్రం గురించి ఇప్పటివరకూ చాలా తక్కువ సమాచారం మాత్రమే అందుబాటులో ఉందని ప్రొఫెసర్ కిమ్ ప్రెబెల్ అన్నారు. ఇది కెనడా నుండి నార్వే వరకు అట్లాంటిక్ మహాసముద్రంలో లోతైన నీటిలో, బ్రిటన్‌కు ఉత్తరాన ఉన్న లోతైన మహాసముద్రాల్లో ఉంటాయని చెప్పారు. ఎక్కువగా ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రంలో ఉంటాయన్నారు. ఇప్పటివరకూ కనుగొన్నవాటిల్లో 392 ఏళ్ల షార్క్ అతి పురాతనమైనదని చెప్పారు. కాగా, ఇప్పటివరకూ కనుగొన్నవాటిల్లో భూమిపై అత్యంత పురాతన జీవి 507 ఏళ్ల మింగ్ క్లామ్(ఆల్చిప్ప ఆకృతిలో ఉండే జీవి).

English summary
Greenland sharks, which can live for close to 400 years, could hold valuable clues about how to extend human life, geneticists predict.The sharks, which are the longest living vertebrate on the planet and can be found off the coast of Britain, are being genetically analysed by researchers at the Arctic University of Norway.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X