వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చర్చిలో ప్రమాదం.. 41 మంది మృతి, ఎక్కడ అంటే..

|
Google Oneindia TeluguNews

ఆదివారం వేళ ప్రార్థన చేస్తుండగా ఈజిప్ట్ ఓ చర్చిలో ప్రమాదం జరిగింది. రాజధాని కైరోలో ఓ చర్చిలో ఫైర్ యాక్సిడెంట్ అయ్యింది. ప్రమాదంలో 41 మంది చనిపోయారు. అబు సిఫైనే చర్చిలో ప్రార్థనలు జరుగుతున్న సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. తప్పించుకునే వీల్లేక పదుల సంఖ్యలో మృతి చెందారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియలేదు.

సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ తీవ్రంగా శ్రమించింది. ఎట్టకేలకు మంటలను అదుపుచేసింది. ప్రమాదంపై ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫతా అల్ సిసి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటన స్థలంలో సహాయక చర్యలు చేపట్టాలని ప్రభుత్వ శాఖలను ఆదేశించారు.

41 Dead In Egyptian Church Fire

చర్చి కాప్టిక్ మతస్థులకు చెందినది. మధ్యప్రాచ్యంలో కాప్టిక్ వర్గం అత్యంత పెద్దదైన క్రైస్తవ సమాజంగా గుర్తింపు పొందింది. ఈజిప్టు జనాభా 103 మిలియన్లు కాగా, అందులో 10 మిలియన్ల మంది కాప్టిక్‌లే ఉన్నారు. ముస్లిం మెజారిటీ దేశం ఈజిప్టులో కాప్టిక్ ప్రజలపై హింస జరుగుతున్న సంగతి తెలిసిందే.

Recommended Video

షుగర్ తో బాధపడుతున్నారా, మునగ ఆకుతో ఇలా చేయండి *Health | Telugu OneIndia

2013లో మాజీ ఇస్టామిక్ ప్రెసిడెంట్ మహమ్మద్ మెర్సీని పదవీచ్యుతుడిని చేశారు. ఆ తర్వాత చర్చి, స్కూల్స్, గృహాలు ధ్వంసం అయ్యాయి. ఏటా క్రిస్మస్ ఈవ్‌కు అంతా హాజరయ్యేవారు. అయితే ఇటీవల ఈజిప్టులో పలు అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. గతేడాది మార్చిలో కైరిలో ఓ ఫ్యాక్టరీలో ప్రమాదం జరగగా.. 20 మంది చనిపోయారు. 2020లో రెండు ఆస్పత్రుల్లో మంటలు చెలరేగి 14 మంది కరోనా సోకిన రోగులు చనిపోయారు.

English summary
fire that broke out in Coptic Christian church in Egypt's capital Cairo killed 41 people, church officials said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X