వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మాలిలో ఘోర రోడ్డు ప్రమాదం: 41 మంది మృతి, 38 మందికి తీవ్రగాయాలు, టైరు పేలడంతోనే ప్రమాదం

|
Google Oneindia TeluguNews

జోహన్నెస్‌బర్గ్: ఆఫ్రికా దేశమైన మాలిలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. సామాగ్రి, కూలీలతో వెళుతున్న లారీ, ప్రయాణికులతో వెళుతున్న బస్సు ఢీకొన్నాయి. ఈ ఘటనలో 41 మంది మరణించారు. మరో 38 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడినవారిని చికిత్స నిమిత్తం సెగో పట్టణంలోని ఆస్పత్రులకు తరలించారు.

కాగా, లారీ టైర్ పేలడంతో డ్రైవర్ వాహనంపై నియంత్రణ కోల్పోయాడని, దీంతో బస్సుకు ఎదురుగా వెళ్లడంతో ప్రమాదం జరిగినట్లు స్థానిక మీడియా పేర్కొంది. ప్రమాదం లో ఈ బస్సు ముందు భాగం తీవ్రంగా ధ్వంసమైంది. ప్రమాద తీవ్రతకు క్షతగాత్రులు రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయారు.

41 Killed In Road Accident In Central Mali

పోలీసులు, అధికారులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదానికి భారీ వర్షాలు కూడా ఓ కారణమని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఘటనా స్థలంలో రోదనలు మిన్నంటాయి.

Recommended Video

Amara Raja Batteries చిత్తూరు నుంచి తమిళనాడుకి AP To Tamil Nadu ఏపీకి గుడ్ బై? || Oneindia Telugu

ఈ ఘటనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కాగా, ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన రోడ్లు ఆఫ్రికా దేశాల్లో దర్శనమిస్తాయి. ఏటా అక్కడి దేశాల్లో ప్రతి లక్ష జనాభాకు రోడ్డు ప్రమాదాల్లోనే 26 మంది చనిపోతున్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి.

English summary
41 Killed In Road Accident In Central Mali.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X