వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమెరికాలో మరో ఉపద్రవం: కరోనా.. జాత్యహంకార అల్లర్లకు తోడుగా: కంపించిన కాలిఫోర్నియా

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: ఒకవైపు కరోనా వైరస్.. మరోవైపు జాత్యహంకార దాడులతో ఉక్కిరిబిక్కిరికి గురి అవుతోంది అగ్రరాజ్యం అమెరికా. లక్షలాది మంది అమెరికన్లు ఇప్పటికే కరోనా వైరస్ బారిన పడ్డారు. లక్ష మందికి పైగా మృత్యువాత పడ్డారు. అదే సమయంలో ఆఫ్రికన్ అమెరికన్ జార్జ్ ఫ్లాయిడ్ హత్యోదంతం తెర మీదికి రావడంతో జాత్యహంకార దాడులు ఆరంభం అయ్యాయి. అమెరికా అంతటా దావానలంలో వ్యాపించాయి. ఈ రెండు ఉదంతాలను ఎదర్కొంటోన్న అమెరికా మరో ఉపద్రవం ముంచుకొచ్చింది.. భూకంపం రూపంలో.

Recommended Video

California earthquake : A magnitude 5.5 earthquake near Ridgecrest

కాలిఫోర్నియాలో భారీ భూకంపం సంభవించింది. అమెరికా కాలమానం ప్రకారం.. బుధవారం రాత్రి కాలిఫోర్నియా దక్షిణ ప్రాంతంలో భూకంపం సంభవించినట్లు అమెరికా అమెరికా జియాలాజికల్ సర్వే విభాగం వెల్లడించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.5గా నమోదైంది. లాస్ ఏంజెలిస్‌కు ఈశాన్య దిక్కున 189 కిలోమీటర్ల దూరంలో భూమి కంపించినట్లు జియాలాజికల్ సర్వే అధికారులు నిర్ధారించారు. సియర్స్‌లెస్ వ్యాలీ ప్రాంతంలోని రిడ్జ్‌క్రెస్ట్, శాన్ బెర్నార్డినో నగరాలపై ఈ భూకంపం ప్రభావం పడినట్లు తెలిపారు. సియర్స్‌లెస్ వ్యాలీని భూకంప కేంద్రంగా గుర్తించారు.

5.5 magnitude earthquake hits California southern parts

భూ ఉపరితలం నుంచి 6.9 కిలోమీటర్ల లోతున పెను భూకంపం సంభవించినట్లు గుర్తించారు. దాని ప్రభావం వల్ల రిడ్జ్‌క్రెస్ట్ నగరం సమీపంలో భూమి ప్రకంపించిందని పేర్కొన్నారు. రిడ్జ్‌క్రెస్ట్ నగరంలో భవనాలు కంపించాయని, వాటి కిటికీ అద్దాలు పగిలిపోవడం వంటి సంఘటనలు చోటు చేసుకున్నట్లు సమాచారం. దీనివల్ల ఏదైనా ప్రాణ, ఆస్తి నష్టాలు సంభవించాయా? లేదా? అనేది ఇంకా తెలియరాలేదు. దీనిపై అధికారులు ఆరా తీస్తున్నారు. 29 వేల జనాభా గల రిడ్జ్‌క్రెస్ట్ సిటీ మొజావె ఎడారికి ఆనుకుని ఉంటుంది.

10 రోజుల వ్యవధిలో ఇదే ప్రాంతంలో అయిదుసార్లు భూమి కంపించిందని జియాలాజికల్ సర్వే అధికారులు వెల్లడించారు. మూడు కంటే తక్కువ తీవ్రత గల భూప్రకంపనలు కావడం వల్ల వాటి ప్రభావం పెద్దగా పడలేదని అన్నారు. అదే సమయంలో 5.5 తీవ్రతతో భారీ భూకంపం సంభవించడం వల్ల ఆందోళన వ్యక్తమౌతోంది. మున్ముందు దీని తీవ్రత మరింత పెరిగే ప్రమాదం ఉండొచ్చనే భయాందోళను స్థానికుల్లో వ్యక్తమౌతున్నాయి. కాలిఫోర్నియా ప్రభుత్వం.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరికలను జారీ చేసింది. రెస్క్యూ విభాగాన్ని సిద్ధం చేసింది.

English summary
A magnitude 5.5 earthquake rumbled near Ridgecrest, about 120 miles northeast of Los Angeles, according to the U.S. Geological Survey, and shaking was felt across Southern California. The USGS estimated that only moderate shaking, or level 5 on the Modified Mercalli Intensity Scale, would have affected Ridgecrest, a city of about 29,000 people in the Mojave Desert. Moderate shaking is capable of breaking dishes and windows and overturning objects, but is not expected to cause major damage.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X