అమెరికాలో తుఫాను బీభత్సం: వరదలు, ఐదుగురు మృతి
వాషింగ్టన్: అమెరికాలోని వేర్వేరు రాష్ట్రాల్లో తుఫాను బీభత్సం సృష్టిస్తోంది. ఈ తుఫాను ధాటికి ఇప్పటివరకు ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. పెనుగాలులు, భారీ వర్షాల కారణంగా భారీగా ఆస్తినష్టం సంభవించింది.

మిచిగాన్, కెంటకి, ఆర్కాన్‌సాస్ తదితర రాష్ట్రాల్లో జోరు వానలు, సుడిగాలులు విరుచుకుపడ్డాయి. మిచిగాన్, కెంటకిలోని అనేక ప్రాంతాల్లో వరదలు ముంచెత్తగా ముగ్గురు వ్యక్తులు నీట మునిగి మరణించారు.
కెంటకిలోని అడైర్‌వీల్ సహా ఆర్కాన్‌సాస్‌లో గంటకు 193 కి.మీ వేగంతో వీచిన పెనుగాలుల కారణంగా పదలు సంఖ్యలో ధ్వంసమయ్యాయి. భద్రతా దళాలు సాహాయక చర్యలను ముమ్మరం చేశాయి. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.












Click it and Unblock the Notifications