వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఫిలిప్పీన్స్ లో పెను భూకంపం: కుప్పకూలిన ఆకాశ హర్మ్యాలు: అయిదుమంది మృతి: విమానాశ్రయం మూసివేత

|
Google Oneindia TeluguNews

మనీలా: ఫిలిప్పీన్స్ లో సోమవారం పెను భూకంపం చోటు చేసుకుంది. రిక్టర్ స్కేల్ పై దీని తీవ్రత 6.4 మాగ్నిట్యూడ్ గా నమోదైంది. భూకంపం ప్రభావానికి రెండు భారీ భవనాలు కుప్పకూలిపోయాయి. ఈ ఘటనలో అయిదుమంది దుర్మరణం పాలయ్యారు. భవన శిథిలాల మధ్య పలువురు చిక్కుకుని ఉన్నట్లు తెలుస్తోంది. శిథిలాలను తొలగించే పనిలో స్థానిక అధికారులు నిమగ్నమయ్యారు. స్థానిక అంతర్జాతీయ విమానాశ్రయాన్ని మూసివేశారు. 24 గంటల పాటు విమానాల రాకపోకలను నిషేధించారు.

5 dead as buildings collapse in Philippiness Luzon earthquake

ఫిలిప్పీన్స్ లోని పంపంగా ప్రావిన్స్ లోని లుజాన్ నగరం శివార్లలో సోమవారం మధ్యాహ్నం భూకంపం సంభవించింది. రాజధాని మనీలాకు ఆగ్నేయంగా 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రాంతాన్ని భూకంప కేంద్రంగా గుర్తించారు. భూమి ఉపరితలం నుంచి 40 కిలోమీటర్ల లోతున భారీ స్థాయిలో భూకంపం సంభవిందని అమెరికాలోని భూగర్భ పరిశోధనా సంస్థ గుర్తించింది. 40 కిలోమీటర్ల లోతున భూ ఫలకాల్లో కదలికలు చోటు చేసుకోవడం వల్ల పెద్ద ఎత్తున ప్రకంపనలు చోటు చేసుకున్నాయని, ఫలితంగా- భూ ఉపరితలంపై 6.3 మాగ్నిట్యూడ్ తో భూమి కంపించినట్లు వెల్లడించింది.

5 dead as buildings collapse in Philippiness Luzon earthquake

దీని ప్రభావం వల్ల లూజాన్ లో రెండు ఆకాశ హర్మ్యాలు కుప్పకూలాయి. ఈ ఘటనలో అయిదుమంది మృతిచెందారు. భవనాల శిథిలాల మధ్య పలువురు చిక్కుకుని ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ఫలితంగా- మృతుల సంఖ్య పెరగొచ్చని స్థానిక అధికారులు చెబుతున్నారు. తక్షణమే సహాయక చర్యలు చేపట్టారు. యుద్ధ ప్రాతిపదికన శకలాలను తొలగిస్తున్నారు. భూ ప్రకంపనలు చోటు చేసుకోగానే.. స్థానికులు ఉరుకులు, పరుగుల మీద నివాసాలను ఖాళీ చేశారు. ఉన్నఫళంగా రోడ్ల మీదికి చేరుకున్నారు. చాలాసేపటి వరకు రోడ్ల మీదే గడిపారు.

లూజాన్ సమీపంలోని క్లార్క్ అంతర్జాతీయ విమానాశ్రయంపైనా భూకంప తీవ్రత కనిపించింది. భూకంప ప్రభావానికి విమానాశ్రయంలోని కొన్ని కట్టడాలు నేలకూలాయి, గాజు తలుపులు భళ్లున పెద్ద శబ్దం చేస్తూ పగిలిపోయాయి. గాజు ముక్కలు గుచ్చుకుని కొందరు ప్రయాణికులకు స్వల్పంగా గాయాలైనట్లు తెలుస్తోంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని క్లార్క్ విమానాశ్రయాన్ని మూసివేశారు. 24 గంటల పాటు విమానాల రాకపోకలను నిషేధించారు. క్లార్క్ విమానాశ్రయానికి రావాల్సిన విమానాలను దారి మళ్లించారు.

English summary
A magnitude 6.3 earthquake struck the Philippines main island of Luzon on Monday and several people were killed in collapsed buildings, media reported. The quake struck 60 km northwest of the capital, Manila, at a depth of 40 km, the U.S Geological Survey. The governor of Pampanga province told a radio station that several people had been killed. Media reported some structures had collapsed and the Clark International Airport, a former U.S. military base, had suffered some damage and had closed. Tall buildings swayed in Manila’s main business district and some people evacuated their offices.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X