వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాబోయ్ : బ్యాంకు ఉద్యోగుల సమావేశం జరుగుతుండగా పైనుంచి కిందకు పడ్డ కొండచిలువ

|
Google Oneindia TeluguNews

చైనా: పాము... ఈ పేరు వింటేనే వల్లు జలదరిస్తుంది. అలాంటిది దారిలో ఓ కొండచిలువ మన కంటపడితే ఆ సమయంలో మన పరిస్థితి ఎలా ఉంటుంది... దాన్ని చూసిన వెంటనే ఆమడ దూరం పరుగులు తీస్తాం. అదే కొండచిలువ మన పక్కనే పాకుతూనో లేద మన ఒళ్లోకి పాకుతూనే ఉంటే పరిస్థితి ఎలా గుంటుంది.... గుండె జారి కడుపులోకి పడిపోదూ... చైనాలో కూడా ఇలానే జరిగింది.

5-foot python falls from ceiling leaving bank staff terrified

చైనాలో ఓ బ్యాంకులోకి అనుకోని అతిథి పైనుంచి రాలి పడింది. అతిథి అంటే మరెవరో కాదు.. ఓ ఐదడుగుల కొండచిలువ. అది కూడా బ్యాంకుకు సంబంధించి ఓ సమావేశం సీరియస్‌గా జరుగుతుండగా ఆఫీస్ సీలింగ్ నుంచి కిందకు పడింది పాము. ఇద్దరు ఉద్యోగస్తులపై పడటంతో.. వారి ఊపిరి ఆగిపోయినంత పనైంది. దీని బరువు దాదాపు 5 కిలోలు ఉంటుంది. ఒక్కసారిగా కిందకు పడటంతో అక్కడ భయానక వాతావరణం నెలకొంది. అందరూ సీరియస్‌గా సమావేశంలో ఉండగా పైనుంచి కిందకు పడింది. పాము కూడా భయపడింది. వెంటనే అది కూడా తన ప్రాణాలు కాపాడుకునేందుకు పాకులాడింది.

ఇలా పాకులాడుతూ ఆ పాము అక్కడే ఉన్న ఫర్నీచర్ కిందకు వెళ్లి దాక్కుంది. ఈ అనుకోని అతిథి బ్యాంకుకు రావడంతో అక్కడి ఉద్యోగస్తులకు గుక్కతిప్పుకోనివ్వలేదు. వారిని ఉరుకులు పరుగులు పెట్టించింది. ఎక్కడి నుంచి తిరిగి తమ కాళ్లను చుట్టుకుంటుందోనన్న భయంతో కనీసం సీట్లలో కూర్చునేందుకు కూడా ఉద్యోగస్తులు భయపడ్డారు. మొత్తానికి భయానక వాతావరణం ఈ కొండచిలువ సృష్టించింది. చివరకు అటవీశాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో ఆ కొండచిలువను చాకచక్యంగా పట్టుకుని దగ్గరలోని అటవీప్రాంతంలో వదిలేశారు.

English summary
chilling footage showing a python falling right through the ceiling during a staff meeting has emerged from a bank in China. The five-foot long snake weighing about five kilos landed between two terrified employees before slithering away.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X