వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇండో-పాక్ బోర్డర్... ఐదుగురు చొరబాటుదారులను మట్టుబెట్టిన బీఎస్ఎఫ్...

|
Google Oneindia TeluguNews

పంజాబ్‌లోని ఇండో-పాక్ సరిహద్దు వెంబడి శనివారం(అగస్టు 22) ఉదయం భారత భద్రతా బలగాలు ఐదుగురు చొరబాటుదారులను కాల్చి చంపాయి. గత పదేళ్లలో ఈ సరిహద్దు వెంబడి ఇంతమంది చొరబాటుదారులను ఒకేసారి మట్టుబెట్టడం ఇదే తొలిసారి. తర్న్ తరన్ జిల్లాలోని ఖేంకరన్ బోర్డర్ ప్రాంతం గుండా చొరబాటుదారులు భారత్‌లోకి ప్రవేశించేందుకు యత్నిస్తుండగా బీఎస్‌ఎఫ్ ప్యాట్రోల్ టీమ్ కాల్పులు జరిపారు. ఈ క్రమంలో చొరబాటుదారులు,భద్రతా బలగాలకు మధ్య కాల్పులు జరిగాయి.

మొదట ఆ చొరబాటుదారులను అడ్డుకునేందుకు యత్నించామని బీఎస్‌ఎఫ్ బలగాలు తెలిపాయి. అయితే వాళ్లు తమపై కాల్పులు జరపడంతో ఆత్మరక్షణలో భాగంగా తామూ కాల్పులు జరపాల్సి వచ్చిందని చెప్పాయి. అర్ధరాత్రి సమయంలోనే సరిహద్దు వద్ద అనుమానాస్పద కదలికలను గుర్తించామని... శనివారం తెల్లవారుజామున 4.45గం. సమయంలో వారి ఆచూకీ కనుగొన్నామని అధికారులు తెలిపారు.

5 Infiltrators Shot Dead By BSF Along The Border With Pakistan In Punjab

చొరబాటుదారుల నుంచి ఒక ఏకె 47 గన్‌తో పాటు రెండు మేగజైన్స్,27 బుల్లెట్లు,4 తుపాకులు స్వాధీనం చేసుకున్నట్లు బీఎస్‌ఎఫ్ ట్వీట్ చేసింది. వీటితో పాటు 9.920 కేజీల మత్తు పదార్థాలను,పాకిస్తాన్ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. కాగా,3300కి.మీ పొడవైన ఇండో-పాక్ సరిహద్దులో పంజాబ్‌ 553కి.మీ సరిహద్దును పంచుకుంటోంది. మిగతా బోర్డర్‌ను జమ్మూకశ్మీర్,రాజస్తాన్,గుజరాత్ రాష్ట్రాలు పంచుకుంటున్నాయి.

Recommended Video

ICC Cricket World Cup 2019 : BSF Personnel Dance And Cheer For India Against Clash With Pak

English summary
Five infiltrators were shot dead by the Border Security Force in an encounter along the Indo-Pak border in Punjab early this morning.The infiltrators were trying to enter the Indian side through the Khemkaran border area in Tarn Taran district when they were spotted by the BSF patrol team, officials said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X