• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

సముద్ర తీరానికి కొట్టుకొచ్చిన 50 ఏళ్ల నాటి బాటిల్... ఇంతకీ అందులో ఏముంది...?

|

పూర్వం రాజులకాలంలో ఎవరైనా ఎవరికైనా ఏదైనా సందేశం పంపాలంటే ఆ సందేశంను ఓ కాగితం ముక్కపై రాసి పావురాలతో చేరవేసేవారు. అలాంటివి నిజంగా ఉన్నాయో లేదో తెలియదు కానీ అప్పట్లో ఉన్నట్లు సినిమాల్లో చూస్తూ ఉంటాం. తాజాగా ఆస్ట్రేలియాలో ఇలాంటి ఘటనే ఒక చోటుచేసుకుంది. అయితే సందేశంను తీసుకొచ్చింది పావురం కాదు.. ఓ గాజు బాటిల్. ఓ కాగితంపై రాసి ఉంచిన సందేశం కలిగి ఉన్న బాటిల్ ఆస్ట్రేలియా సముద్ర తీరానికి కొట్టుకొచ్చింది. ఓ మత్స్యకారుడికి దొరికింది.

సముద్ర తీరంకు కొట్టుకువచ్చిన బాటిల్

సముద్ర తీరంకు కొట్టుకువచ్చిన బాటిల్

దక్షిణ ఆస్ట్రేలియా తీరంకు ఓ బాటిల్ కొట్టుకువచ్చింది. అది పాల్ ఇలియట్ అతని కొడుకు జ్యాల కంటపడింది. ఈ బాటిల్‌ను చూసి వారు ఒక్కింత ఆశ్చర్యానికి గురయ్యారు. అయితే బాటిల్ తెరిచి చూడగా వారికి 50 ఏళ్ల క్రితం రాసి ఉన్న ఓ కాగితం ముక్క కనిపించింది. ఆ కాగితం ముక్క చదివిన వారికి ఓ విషయం అర్థమైంది. 50 ఏళ్ల క్రితం అప్పుడు పాల్ గిల్‌మోర్ అనే 13 ఏళ్ల బాలుడు తన కథను రాశాడు. తను ఓ నావలో దక్షిణ తీర ప్రాంతంన ఉన్న ఫ్రిమాంటిల్ నుంచి మెల్బోర్న్‌కు వెళుతున్నట్లు రాశాడు. ఇప్పుడు ఆ బాలుడు పెద్దవాడై ఉండి ఉంటాడు. ఇక ఆ కాగితంను జాగ్రత్తగా పరిశీలిస్తే పేపర్‌పై సిట్మర్ లైన్ అనే కంపెనీ పేరు రాసి ఉంది. ఇక తేదీ కూడా ఉంది. ఇది 17 నవంబర్ 1969లో రాశాడు.

 ఓ పేపర్‌లో కథ రాసి బాటిల్‌లో ఉంచిన బాలుడు

ఓ పేపర్‌లో కథ రాసి బాటిల్‌లో ఉంచిన బాలుడు

ఇక తన కథలో ఆ 13 ఏళ్ల గిల్‌మోర్ చాలా విషయాలు తెలిపాడు. ఫెయిర్‌స్టార్ అనే నౌకలో తాను ప్రయాణిస్తున్నట్లుగా చెప్పాడు. ఈ నౌక నాడు బ్రిటీషు వలసదారులను ఆస్ట్రేలియాకు మోసుకొచ్చిందని చెప్పుకొచ్చాడు. ఈ మటుకు రాసి బాటిల్‌‌లో ఉంచి దాన్ని సముద్రంలో పడివేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ బాటిల్ ఎవరికైనా దొరికితే దాన్ని ఫలానా చిరునామాకు తీసుకొచ్చి ఇవ్వాలంటూ చెబుతూ మెల్‌బోర్న్‌లో ఓ అడ్రస్‌ కూడా రాసి ఉంచాడు. సీసా సముద్రంలో వేసిన సమయానికి ఫ్రెమాంటిల్‌కి తూర్పున 1000 మైళ్ల దూరంలో అతను ఉన్నట్లు లేఖలో తెలిపాడు.

 1960వ దశకంలో ఆస్ట్రేలియాకు వలసలు

1960వ దశకంలో ఆస్ట్రేలియాకు వలసలు

ఇదిలా ఉంటే 50 ఏళ్ల నాటి ఈ బాటిల్ సముద్రంపై తేలే అవకాశం లేదని ఓషనోగ్రాఫర్ డేవిడ్ గ్రిఫిన్ చెబుతున్నాడు. బాటిల్ సముద్రంలో విసిరేసినప్పుడు అది తేలుకుంటూ పోయి ఎక్కడో ఒడ్డున ఇసుకలో కూరుకుపోయి ఉంటుందని చెప్పారు. ఇటీవల కురిసిన వర్షాలకు అది తిరిగి ఒడ్డుకు కొట్టుకువచ్చి ఉండొచ్చనే అభిప్రాయంను గ్రిఫిన్ వ్యక్తం చేశాడు. ఇదిలా ఉంటే 1960వ దశకంలో ఆస్ట్రేలియా ప్రభుత్వం వలసదారులకు ఓ పథకం ప్రవేశపెట్టింది. బ్రిటన్ నుంచి వలస వచ్చే వారికి సబ్సీడీతో కూడిన ఛార్జీలు ప్రకటించింది. అంతేకాదు పిల్లలు ఉచితంగా ప్రయాణం చేయొచ్చని ఆ స్కీములో పేర్కొంది. దీంతో పెద్ద సంఖ్యలో బ్రిటన్ నుంచి ప్రజలు ఆస్ట్రేలియాకు వలసవచ్చారు. అయితే ఆస్ట్రేలియాలో బతకడం కష్టమైనప్పుడు వలస వచ్చినవారిలో సగం మంది తిరిగి బ్రిటన్‌కు వెళ్లపోయారు.

మొత్తానికి ఈ బాటిల్ సముద్రానికి మోసుకొచ్చిన సందేశంను చూసిన ఇలియట్ ఇక ఆ కథ రాసిన బాలుడు ఎక్కడున్నాడో కనుక్కునే పనిలో పడ్డాడు. 13 ఏళ్లు చిన్నారిగా ఉన్నప్పుడు ఆ సందేశం రాశాడు. ఇప్పుడు ఆ బాలుడు పెద్దవాడై 63 ఏళ్ల వయస్సు ఉండొచ్చని ఇలియట్ చెప్పాడు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A fisherman man said on Wednesday he was looking for the author of a message in a bottle found off the southern Australian coast 50 years after it was written.Paul Elliot told Australian Broadcasting Corp. that he and his son Jyah found the bottle on the west coast of Eyre Peninsula in South Australia state while fishing.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more