వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

షాకింగ్: 50 కోట్ల యాహూ అకౌంట్లు హ్యాకింగ్, కానీ

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: 500 మిలియన్ (50కోట్ల) యూజర్ల అకౌంట్లు హ్యాకింగ్‌కు గురైనట్లు యాహూ ప్రకటించింది. దీనిని స్టేట్ స్పాన్సర్డ్ అటాక్‌గా పేర్కొంది. గురువారం నాడు యాహూ చీఫ్ ఇన్‌ఫర్మేషన్ సెక్యూరిటీ ఆఫీసర్ బాబ్ లార్డ్ మాట్లాడుతూ.. ఈ సమాచారాన్ని అంతటిని కంపెనీ నెట్ వర్క్ నుంచి 2014లో దొంగిలించారని చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి.

పేర్లు, ఈ మెయిల్ అడర్స్, టెలిఫోన్ నెంబర్లు, పుట్టిన తేదీలు, పాస్‌వర్డ్‌లతో పాటు ఎన్‌క్రిప్ట్, ఆన్ ఎన్‌క్పిప్డ్ ప్రశ్నలు, సమాధానాలు కూడా హ్యాకింగ్‌కు గురైన వాటిలో ఉన్నాయని చెప్పారు.

హ్యాకింగ్‌కు సంబంధించి విచారణ కొనసాగుతోందని తెలిపారు. విచారణలో వెల్లడైన సమాచారం మేరకు.. హ్యాకింగ్‌కు గురైన వాటిలో అన్‌ప్రొటెక్టెడ్ పాస్‌వర్డ్‌లు, పేమెంట్ కార్డ్ డాటా, బ్యాంకు అకౌంట్ సమాచారం తదితరాలు లేవని తెలుస్తోంది.

పేమెంట్ కార్డ్ డేటా, బ్యాంక్ అకౌంటులకు సంబంధించిన సమాచారాన్ని హ్యాకింగ్‌కు గురైన సిస్టంలో ఉంచలేదని (స్టోర్ చేయలేదని) అతను చెప్పారు.

500 million accounts hacked, says Yahoo

విచారణలో మరో విషయం కూడా వెల్లడైందన్నారు. హ్యాకింగ్ చేసిన వారు యాహూ నెట్ వర్క్‌ను చాలాకాలంగా ఉపయోగిస్తున్న వారు కాదన్నారు.

ఇదిలా ఉండగా, ప్రపంచవ్యాప్తంగా మూడు వందల మిలియన్ల ఈ మెయిల్ అకౌంట్లు హ్యాక్ అయ్యాయని, హ్యాకర్లు జీమెయిల్, హాట్ మెయిల్, యాహూ అకౌంట్లు హ్యాక్ చేసి పాస్ వర్డ్స్, ఇతర సమాచారం దొంగిలించారని, ఈ సమాచారాన్ని రష్యాలోని క్రిమినల్ అండర్ వరల్డ్‌కు విక్రయించినట్లుగా అధికారుల విచారణలో వెల్లడైందని గతంలోను వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.

English summary
Yahoo has confirmed that hackers stole information from at least 500 million user accounts in what it describes as a "state-sponsored" attack.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X