వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

2020 అమెరికా అధ్యక్ష ఎన్నికల సర్వే: ట్రంప్‌ను మళ్లీ అధ్యక్షుడిగా ఎన్నుకుంటారా..?

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: ఎప్పుడూ నోరు జారి ప్రధాన వార్తల్లో నిలిచే అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు మరోసారి అధ్యక్షుడయ్యే అవకాశాలు సన్నగిల్లుతున్నాయా...? అంటే ఔననే సమాధానం వినిపిస్తోంది. 2020లో అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. సాధారణంగా ఓ వ్యక్తిని రెండు సార్లు అమెరికా అధ్యక్షుడిగా ఎన్నుకోవడం ఆనవాయితీగా వస్తుంది. కానీ ఈ సారి మాత్రం ట్రంప్‌కు కష్టకాలం తప్పదని సమాచారం.

2020లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు

2020లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు

అమెరికా అధ్యక్ష ఎన్నికలకు మరో ఏడాది సమయం మాత్రమే ఉంది. ఇప్పటికే డెమొక్రాటిక్ పార్టీ అధ్యక్ష పదవికి తమ అభ్యర్థులను ఖరారు చేసే పనిలో పడింది. ఇప్పటికే అధ్యక్ష పదవికి పోటీపడుతున్న కొంతమంది అభ్యర్థుల పేర్లు చక్కర్లు కొడుతున్నాయి. వీరిలో ముగ్గురు మహిళా అభ్యర్థులు ఉన్నారు. ఇక ఎన్నికల వేళ ఎలాగూ సర్వేల సందడి ఉండనే ఉంటుంది. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అధ్యక్ష పదవికి ఎవరిని ఎన్నుకునేందుకు సిద్ధంగా ఉన్నారనేదానిపై వాషింగ్‌టన్ పోస్ట్ - ఏబీసీ న్యూస్ సర్వేలు నిర్వహించాయి.

 అమెరికా అధ్యక్ష ఎన్నికలపై సర్వే

అమెరికా అధ్యక్ష ఎన్నికలపై సర్వే

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఎవరు విజేతలుగా నిలుస్తారనేదానిపై వాషింగ్టన్ పోస్టు-ఏబీసీ న్యూస్ సర్వే నిర్వహించగా డొనాల్డ్ ట్రంప్‌కు షాక్ ఇచ్చే ఫలితాలు వచ్చాయి. ఇందులో 56శాతం మంది కొత్త అభ్యర్థిగా అధ్యక్షుడు వస్తూ బాగుంటుందని అభిప్రాయపడ్డారు. అంటే ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపడుతున్న ట్రంప్‌కు ఒక్కింత నిరాశ కలిగించే ఫలితంగా చూడాలి. 56 శాతం మంది కొత్త అభ్యర్థి కోసం ఓటు వేశారంటే అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్‌ను తిరస్కరిస్తున్నారని అర్థం.

56 శాతం మంది ట్రంప్‌ను అధ్యక్షుడిగా తిరస్కరించారు

56 శాతం మంది ట్రంప్‌ను అధ్యక్షుడిగా తిరస్కరించారు

56 శాతం మంది ట్రంప్‌కు ఓటు వేయమని స్పష్టం చేయగా.. మరో 28 శాతం మంది రిపబ్లికన్ అభ్యర్థికి ఓటు వేస్తామని చెప్పారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే రిపబ్లిక్ అభ్యర్థిగా ట్రంప్ నిలబడితే ఆయనకు ఓటు వేసేందుకు తిరస్కరిస్తున్నారు. ట్రంప్ కాకుండా మరే వ్యక్తి అభ్యర్థిగా నిలబడినా ఓటువేస్తామని తెలిపారు. మరోవైపు రిపబ్లికన్ పార్టీలోనే అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ అభ్యర్థిత్వాన్ని చాలామంది వ్యతిరేకిస్తున్నారు. ఇక డెమొక్రటిక్ పార్టీ నుంచి పలువురు అభ్యర్థులు అధ్యక్ష రేసులో ఉన్నప్పటికీ ఎవరికీ స్పష్టమైన మెజార్టీ రాలేదని సర్వే వెల్లడించింది.

ఇదిలా ఉంటే అమెరికా మాజీ అధ్యక్షుడు జోబిడెన్ పేరుకు 9శాతం మంది మద్దతు తెలుపగా.. కాలిఫోర్నియా సెనేటర్ కమలా హారిస్‌కు 8శాతం మంది అమెరికా అధ్యక్షు రేసుకు మద్దతు తెలిపారు. ఇక ఈ సర్వేను జనవరి 21వ తేదీ నుంచి 24వ తేదీ వరకు చేసింది. ఈ సర్వేలో పెద్ద ఎత్తున యువత నుంచి అభిప్రాయాలను సేకరించింది వాషింగ్టన్ పోస్ట్ - ఏబీసీ సర్వే .

English summary
The next presidential election in the United States is just another year away and the Democratic primary field for the presidency has already started taking shape.A few candidates have already nominated themselves for the race and they include three women. The Democratic primary promises to be crowded and according to a poll conducted by Washington Post-ABC News the result of which was released on Tuesday (January 29) 56 per cent of the respondents are yet to pick a candidate of choice.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X