• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

లాస్ వెగాస్ నరమేధం మా సైనికుడి పనే: ఐసిస్, 58కి పెరిగిన మృతులు, క్షతగాత్రులు 515..

By Ramesh Babu
|

న్యూయార్క్: లాస్ వెగాస్ లో ఆదివారం అర్థరాత్రి ఓ సాయుధుడు సృష్టించిన నరమేధంలో మృతులు, క్షతగాత్రుల సంఖ్య పెరిగింది. తాజా సమాచారం ప్రకారం.. ఈ కాల్పుల్లో దాదాపు 58 మంది మృతిచెందగా, 515 మంది వరకు గాయపడ్డారు.

లాస్‌ వెగాస్‌ స్ట్రిప్‌లో దేశీయ సంగీత ఉత్సవం జరుగుతున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. సంగీత విభావరి జరుగుతున్న ప్రదేశం పక్కనే ఉన్న మాండలై బే హోటల్‌లోని 32వ అంతస్తు నుంచి సాయుధుడు ఒక్కసారిగా కాల్పులకు తెగబడిన సంగతి తెలిసిందే.

సంగీత విభావరిపై సాయుధుడు కాల్పులు జరిపారనే సమాచారం అందగానే పోలీసులు క్షణాల్లో అక్కడికి చేరుకున్నారు. ఆ ప్రాంతమంతటినీ తమ అధీనంలోకి తీసుకున్నారు. క్షతగాత్రులను వెంటనే సమీప ఆసుపత్రికి తరలించారు. అయితే వారిలో చాలామంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

అమెరికాపై పగ తీర్చుకునేందుకే...

అమెరికాపై పగ తీర్చుకునేందుకే...

మరోవైపు లాస్ వెగాస్ లో నరమేధానికి పాల్పడింది తమ సైనికుడంటూ ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ ప్రకటించింది. కొన్ని నెలల క్రితమే అతడు ఇస్లాం మతాన్ని స్వీకరించాడని పేర్కొంది. ఐసిస్ ఉగ్రవాద సంస్థ న్యూస్ ఏజెన్సీ అయిన అమాక్ సోమవారం ఈ మేరకు ప్రకటించింది.

ఈ ఘాతుకానికి పాల్పడిన వ్యక్తి పేరును ఐసిస్ ప్రకటించకపోయినప్పటికీ, లాస్ వెగాస్ పోలీసులు ఆ వ్యక్తి ఎవరన్నది కనిపెట్టారు. అతడి పేరు స్టీఫెన్ పెడోక్(64). ఇరాక్, సిరియా దేశాల్లో సంకీర్ణ సేనల పోరుకు వ్యతిరేకంగా అమెరికాపై పగ తీర్చుకునేందుకే ఐసిస్ ఈ నరమేధానికి పాల్పడినట్లు తెలుస్తోంది.

కాల్పుల అనంతరం ఆత్మాహుతి...

కాల్పుల అనంతరం ఆత్మాహుతి...

పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకోగానే, మొదట మాండలై బే హోటల్‌లోని 32వ అంతస్తుకు చేరుకున్నారు. ఆ అంతస్తులో సాయుధుడు కాల్పులకు పాల్పడిన గదిలో 10 రైఫిళ్లు కూడా పోలీసులకు లభ్యమయ్యాయి. ఆ గదిలో స్టీఫెన్ పెడోక్ మృతదేహాన్ని కూడా వారు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు చేరుకునే సరికే స్టీఫెన్ పెడోక్ చనిపోయి ఉన్నాడని, కాల్పులు జరిపిన అనంతరం అతడు ఆత్మాహుతి చేసుకుని ఉంటాడని తాము భావిస్తున్నామని లాస్ వెగాస్ పోలీసు షెరీఫ్ జోసెఫ్ లంబార్డో పేర్కొన్నారు. తీవ్ర కలకలం రేపిన ఈ దాడిని ప్రపంచ దేశాలు ముక్తకంఠంతో ఖండించాయి.

ఉలిక్కిపడిన అమెరికా...

ఉలిక్కిపడిన అమెరికా...

అయితే కాల్పుల ఘటనలో స్టీఫెన్ పెడోక్ తోపాటు మరో వ్యక్తి కూడా పాల్గొన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అతడితోపాటు ఒక మహిళ కూడా ఉందనే అనుమానం మేరకు ఆ మహిళ కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. గుర్తింపు కార్డు లేని వారిని అదుపులోకి తీసుకుంటున్నారు. లాస్‌ వెగాస్‌ లోపలికి వచ్చే మార్గాలన్నంటిని అధికారులు మూసివేసి హై అలర్ట్‌ ప్రకటించారు. డొనాల్డ్ ట్రంప్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తరువాత అమెరికాలో జరిగిన మొదటి ఉగ్రదాడి ఇదే. 1949 తర్వాత అమెరికాలో జరిగిన అతి పెద్ద దాడి కూడా ఇదేనని పోలీసులు చెబుతున్నారు. ఏ దాడిలోనూ ఒకే వ్యక్తి ఇంత మందిని చంపడం జరగలేదని వారంటున్నారు. వరల్డ్ ట్రేడ్ సెంటర్‌పై 2002లో జరిగిన దాడి తర్వాత ఉగ్ర జాడలు అమెరికాలో కనిపించలేదు. మళ్లీ సోమవారం నాటి ఉగ్రదాడితో అమెరికా ఉలిక్కిపడింది.

ఆత్మశాంతి కోసం ప్రార్థిస్తున్నాం...

ఆత్మశాంతి కోసం ప్రార్థిస్తున్నాం...

అమెరికాలోని లాస్ వెగాస్ లో జరిగిన విషాద సంఘటనపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. ఈ కాల్పుల ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని కోరుతూ ఈ మేరకు ఓ ట్వీట్ చేశారు. ఈ సంఘటనపై ఆవేదన వ్యక్తం చేస్తూ ట్రంప్ తన ఫేస్ బుక్ ఖాతాలో ఓ పోస్ట్ చేశారు. ‘ఎంతో భయంకరమైన ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయిన, గాయపడ్డ వారి కోసం నేను, మెలానియా దేవుడిని ప్రార్థిస్తున్నాం. యావత్తు దేశం కోసం, ఐక్యత, శాంతి కోసం ప్రార్థిస్తున్నాం ...ప్రాణాలు కోల్పోయిన వారి ఆత్మలకు శాంతి కలగాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాం. ఈ బాధ నుంచి కోలుకునే శక్తిని బాధిత కుటుంబాలకు దేవుడు ప్రసాదించాలని కోరుకుంటున్నాను..' అని ట్రంప్ పేర్కొన్నారు.

English summary
The Islamic State group has claimed responsibility for the mass shooting in Las Vegas, saying that the perpetrator was "a soldier" who had converted to Islam months ago, without providing any evidence to support the claim. The group released two statements on its Aamaq news agency on Monday, hours after the shooting at a country music concert that killed at least 58 people and wounded at least 515. It did not name the suspected shooter, identified by Las Vegas police as 64-year-old Stephen Paddock, but said he had "executed the operation in response to calls to target countries of the coalition" batting the extremist group in Iraq and Syria.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more
X