వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమెరికాలోని కాలిఫోర్నియాలో భూకంపం: చైనాలో 140సార్లు కంపించిన భూమి

అమెరికాలోని నార్త్‌ కాలిఫోర్నియాలో గురువారం నాడు భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పైన దీని తీవ్రత 6.5గా నమోదయింది.

|
Google Oneindia TeluguNews

కాలిఫోర్నియా: అమెరికాలోని నార్త్‌ కాలిఫోర్నియాలో గురువారం నాడు భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పైన దీని తీవ్రత 6.5గా నమోదయింది. కాలిఫోర్నియాలోని ఫెర్న్‌డేల్‌కు పశ్చిమాన 150 కిమీ దూరంలో భూమికి 10 కి.మీ. అడుగున భూకంపకేంద్రాన్ని గుర్తించారు

earthquake

భూఉపరితలం నుంచి 10 కిలోమీటర్ల లోపల భూమి కంపించినట్లు అమెరికా జియాలోజికల్ సర్వే డిపార్టుమెంట్ పేర్కొంది. సునామీ సంభవించే అవకాశం లేదని చెప్పింది.

శాన్ ఫ్రాన్సిస్కోలోను భూప్రకంపనలు వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. దాదాపు ఇరవై సెకన్లు కంపించినట్లు ఓ వ్యక్తి ట్వీట్ చేశాడు. అయితే జియాలాజికల్ సర్వే ధృవీకరించలేదు. 2010లో కాలిఫోర్నియాలో రిక్టర్ స్కేల్ పైన 6.5 తీవ్రత భూకంపం వచ్చింది. అప్పుడు పవర్ లైన్స్, ట్రాఫిక్ సిగ్నల్స్ తదితరాలు దెబబ్తిన్నాయి.

భూకంపం చైనాను కూడా వణికించింది. వాయవ్య చైనాలోని హుటుబి కంట్రీ, యురింకీ, చాంగ్లీలలో భూకంపానికి భయపడి ప్రజలు బయటే గడిపారు. యురింకీలో భూమి 140సార్లు కంపించింది. ఇందులో ఆరుసార్లు రిక్టర్‌స్కేల్‌పై 3 నుంచి 3.9గా భూకంప తీవ్రత నమోదైంది. కాగా, ఇండోనేసియాలో బుధవారం సంభవించిన భూకంపానికి మృతి చెందినవారి సంఖ్య గురువారానికి 102కు చేరింది. అయితే, అమెరికా, చైనాలలో మాత్రం ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదు.

English summary
An earthquake measuring 6.5 on the Richter scale struck California coast on Thursday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X