వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇండోనేషియాలో మరోసారి భారీ భూకంపం: సునామీ హెచ్చరికలు..

|
Google Oneindia TeluguNews

రెండు రోజుల క్రితం పీఓకే సహా పాకిస్థాన్ లో పలు ప్రాంతాల్లో సంభవించిన భూపకంలో 30 మందికి పైగా మరణించారు. తాజాగా ఈ రోజు ఉదయం ఇండోనేషియా భూకంపం సీరం దీవుల్లో 29.9 కిలోమీటర్ల లోతులో భూకంపం వచ్చిందని యునైటెడ్ స్టేట్స్ జియాలాజికల్ సర్వే వెల్లడించింది. ఈ భూకంపం రిక్టరు స్కేలుపై 6.5గా నమోదైంది. ఈ భూకంపం వల్ల సునామీ ప్రమాదం లేదని అమెరికా జియాలాజికల్ సర్వే శాస్త్రవేత్తలు చెప్పారు. ఈ భూకంపం వల్ల ఎలాంటి నష్టం సంభవించలేదని ఇండోనేషియా అధికారులు చెప్పారు. అయితే.. 2004 అదే విధంగా 2018 లో వచ్చిన భూకంపాల్లో భారీగా ప్రాణ నష్టం జరిగింది. దీంతో..భూకంపం రాగానే ఇండోనేషియా ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు.

సీరం దీవుల్లో భూకంపం..

సీరం దీవుల్లో భూకంపం..

ఇండోనేషియా దేశంలో ఉదయం భూకంపం సంభవించింది. సెంట్రల్ ఇండోనేషియా దేశం మాలుకు ప్రావిన్సు పరిధిలోని సీరం దీవుల్లో 29.9 కిలోమీటర్ల లోతులో భూకంపం వచ్చిందని యునైటెడ్ స్టేట్స్ జియాలాజికల్ సర్వే వెల్లడించింది. ఈ భూకంపం రిక్టరు స్కేలుపై 6.5గా నమోదైంది. ఈ భూకంపం వల్ల ఎలాంటి నష్టం సంభవించలేదని ఇండోనేషియా అధికారులు చెప్పారు.

ఫసిపిక్ సముద్రం పరిధిలోని ఇండోనేషియాలో తరచూ భూకంపాలు, అగ్నిపర్వతాల నుంచి లావా వెదజల్లటం చేస్తుంటాయి. విపత్తు నిర్వహణ అధికారులు అందిస్తున్న సమాచారం మేరకు అంబాన్ లో దాదాపు 40 కిలో మీటర్ల మేరకు బ్రిడ్జి స్వలంగా దెబ్బ తిన్నది. అదే విధంగాఅల్ అన్షార్ ఇస్లాం బోర్డింగ్ పాఠశాలలో భూకంపం ధాటికి నేల..కుర్చీలు కదిలాయి. అయితే ఎక్కడా ఎవరూ గాయపడలేదని.. నష్టం జరగలేదని అధికారులు స్పష్టం చేసారు. ఇండోనేషియాలో భూకంపం అనగానే సునామి భయం సాధారణంగా ఏర్పడుతోంది. అయితే..ఈ సారి ఈ భూకంపం తీవ్రత ఎక్కవగా ఉన్నా సునామీకి అవకాశం లేదని శాస్త్రవేత్తలు స్పష్టం చేసారు. దీని ప్రభావం ఎలా ఉందనే అంశం మీద ప్రభుత్వం పూర్తిగా ఫోకస్ చేసింది.

వెంటాడుతున్న సునామీ భయాలు..

వెంటాడుతున్న సునామీ భయాలు..

ఇండోనేషియాలో గతంలో వచ్చిన భూకంపాల సమయంలో సునామీలు సైతం ఏర్పడేవి. దీని కారణంగా వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ భయం ఇంకా అక్కడి వారిని వెంటాడుతూనే ఉంది. 2004 లో సుమిత్రా దీవుల్లో వచ్చిన భూకంపం కారణంగా హిందూ మహా సముద్రంలో సునామీ ఏర్పడింది. ఫలితంతా 14 దేశాల్లో దాదాపు 226000 మంది ప్రాణాలు కోల్పోగా..అందులో కేవలం ఇండోనేషియాలోనే 120000 మంది ప్రాణాలు విడిచారు. అదే విధ:గా మరోసారి 2018 సెప్టెంబర్ లో పాలు దీవుల్లో ఏర్పడిన భూకంపం ఫలితంగా సునామీ ఏర్పడింది.

ఆ సమయంలో భూ కంప తీవ్రత 7.5గా నమోదైంది. అప్పుడు ఏర్పడిన సునామీ ధాటికి నాలుగు వేల మందికి పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. అయితే ఈ ఉదయం ఏర్పడిన భూ కంపం తీవ్రత తెలిసిన వెంటనే స్థానికులు ఆందోళనకు గురయ్యారు. అయితే అధికారులు దీని కారణంగా సునామీకి అవకాశం లేదని చెప్పటంతో ఊపిరి పీల్చుకున్నారు.

30కి పెరిగిన మృతుల సంఖ్య

30కి పెరిగిన మృతుల సంఖ్య

రెండు రోజుల క్రితం పీఓకే కేంద్రంగా ఏర్పడిన భూకంపం ధాటికి మరణించిన వారి సంఖ్య పెరుగుతోంది. పాక్‌లో భూకంపానికి కూలిపోయిన ఇళ్లు. పీవోకే సహా పాక్‌లోని పలు నగరాల్లో సంభవించిన ఈ భూకంపంలో మృతుల సంఖ్య 30కి పెరిగింది. 452 మంది గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. 100 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారని, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని పీవోకే విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది.

ఈ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఆస్తినష్టం జరిగిందని , దేశంలోని పలు ప్రధాన నగరాల్లోనూ ప్రకంపనల ప్రభావం కనిపించిందని తెలిపింది. పాక్‌తోపాటు భారత్‌లోని డిల్లీ రాజధాని ప్రాంతం సమా పలు చోట్ల మంగళవారం భూ ప్రకంపనలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. భూకంప మృతులకు భారత ప్రధాని నరేంద్రమోదీ సంతాపం తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రధాని సానుభూతి ప్రకటించారని, క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారని ప్రధానమంత్రి కార్యాలయం ట్వీట్‌ చేసింది. ఇప్పుడు ఇండోనేషియాలో ఏర్పడిన భూ ప్రకంపనలు ద్వారా ఎటువంటి పరిస్థితి ఏర్పడుతుందనే దాని పైన అన్ని దేశాలు అలర్ట్ అయ్యాయి.

English summary
A powerful earthquake hit Indonesia's Seram Island. The 6.5 Richter Scale quake hit the island of Seram in Indonesia's eastern province of Maluku.But, no riks of tsunami with this quake.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X