వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లైకా: ఈ కుక్క అంతరిక్షంలోకి వెళ్లి అరవై ఏళ్లు, ఎలా చనిపోయిందంటే

1957 నవంబర్ 3న స్నుత్నిక్ 2 స్పేస్ షిప్‌లో లైకా అనే కుక్కను అంతరిక్షానికి పంపించింది రష్యా. ఇది జరిగి అరవై ఏళ్లవుతోంది. భూమిని చుట్టి వచ్చిన తొలి జీవరాశిగా ఈ కుక్క చరిత్రలో నిలిచిపోయింది.

|
Google Oneindia TeluguNews

మాస్కో: 1957 నవంబర్ 3న స్నుత్నిక్ 2 స్పేస్ షిప్‌లో లైకా అనే కుక్కను అంతరిక్షానికి పంపించింది రష్యా. ఇది జరిగి అరవై ఏళ్లవుతోంది. భూమిని చుట్టి వచ్చిన తొలి జీవరాశిగా ఈ కుక్క చరిత్రలో నిలిచిపోయింది.

ఆ తర్వాత మూడున్నరేళ్లకు మానవుడు అంతరిక్షంలోకి వెళ్లాడు. 1961లో యూరీ గగారిన్ అంతరిక్షంలోకి వెళ్లిన తొలి మానవుడిగా చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే.

అంతకంటే ముందు అంతరిక్షంలోకి వెళ్లిన కుక్క లైకా విగ్రహం మాస్కోలోని సెంట్రల్ హౌజ్ ఆఫ్ ఏవియేషన్ అండ్ కాస్మోటిక్స్‌లో ఉంది.

అంతరిక్షంలోకి వెళ్లేటప్పుడు మూడేళ్లు

అంతరిక్షంలోకి వెళ్లేటప్పుడు మూడేళ్లు

అంతరిక్షంలోకి వెళ్లిన సమయంలో కుక్క వయస్సు మూడేళ్లు. అంతకుముందు ఇది కేవలం ఓ వీధి కుక్క. మాస్కో వీధుల్లో తిరుగుతున్న ఈ కుక్కును తీసుకు వచ్చి దానికి శిక్షణ ఇచ్చి అంతరిక్షంలోకి పంపించేందుకు శాస్త్రవేత్తలు సిద్ధం చేశారు.

 కొన్ని గంటల్లోనే చనిపోయిందని

కొన్ని గంటల్లోనే చనిపోయిందని

అంతరిక్షంలోకి వెళ్లిన తర్వాత ఇది కనీసం 8 నుంచి పది రోజులు అయినా జీవించి ఉంటుందని భావించారు. కానీ కొన్ని గంటల్లోనే చనిపోయింది. క్యాప్సూల్ అధికంగా ఉండటం, డీహైడ్రేషన్ కారణంగా మృత్యువాత పడినట్లుగా గుర్తించారు.

 అధికారికంగా ఇచ్చిన సమాచారం ఇలా

అధికారికంగా ఇచ్చిన సమాచారం ఇలా

లైకా చనిపోవడం వెనుక అధికారికంగా ఇచ్చిన సమాచారం మాత్రం మరోలా ఉంది. స్నుత్నిక్ తిరిగి భూవాతావరణంలోకి చేరే సమయంలో లైకా తీవ్ర అనారోగ్యానికి గురై మరణించే ప్రమాదం ఉండటంతో ముందే దానికి విషం ఇచ్చి చంపేసినట్లు శాస్త్రవేత్తలు తెలిపారు.

 ఆ తర్వాత ఎన్నో జంతువులు అంతరిక్షంలోకి

ఆ తర్వాత ఎన్నో జంతువులు అంతరిక్షంలోకి

లైకా అవశేషాలు ఉన్న ఈ టైటిల్‌ను ఐదు నెలల తర్వాత అంటే ఏప్రిల్ 14, 1958లో భూవాతావరణంలోకి రాగానే కాల్చేశారు. లైకా కుక్క తర్వాత చింపాజీ, ఎలుక, పిల్లులను వివిధ దేశాలు అంతరిక్షంలోకి పంపించాయి.

English summary
60 years to Laika the dog’s journey into space.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X