వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైట్‌హౌస్‌లో బైడెన్‌-కమల టీమ్‌ రెడీ- 61 శాతం మహిళలు-54 శాతం నల్లజాతీయులతో..

|
Google Oneindia TeluguNews

హోరాహోరీగా సాగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అఖండ విజయాన్ని అందుకున్న జో బైడెన్‌-కమలా హ్యారిస్‌ ప్రమాణ స్వీకారానికి సిద్దమవుతున్నారు. వైట్‌హౌస్‌లో వచ్చే నాలుగేళ్లపాటు వీరికి సహకరించే బృందాన్ని ఇప్పటికే వీరు ఎంపిక చేసుకున్నారు. ఇందులో గతంలో ఎన్నడూ లేని విధంగా పలు సంచలన ఎంపికలు చేశారు. వైట్‌హౌస్‌కు ఎంపిక చేసిన బైడెన్‌-కమల టీమ్‌లో ఏకంగా 61 శాతం మంది మహిళలు, 54 శాతం మంది నల్ల జాతీయులకు చోటు కల్పించారు. తద్వారా తమకు ఈ రెండు వర్గాలు ఎంత ముఖ్యమో చెప్పకనే చెప్పారు. అమెరికాలో నల్ల జాతీయుల వ్యతిరేకతతో ట్రంప్ అధికారం కోల్పోయిన నేపథ్యంలో ఈ ఎంపికలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

జనవరి 20న బైడెన్‌-కమల ప్రమాణస్వీకారం- కరోనా భయంతో వేదిక మార్పుజనవరి 20న బైడెన్‌-కమల ప్రమాణస్వీకారం- కరోనా భయంతో వేదిక మార్పు

 బైడెన్-కమల వైట్‌హౌస్‌ టీమ్‌...

బైడెన్-కమల వైట్‌హౌస్‌ టీమ్‌...

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలుపుతో ఊపుమీదున్న జో బైడెన్‌-కమలా హ్యారిస్ వచ్చే నాలుగేళ్ల పాటు వైట్‌హౌస్‌ నుంచి సాగే తమ పాలనపై ప్రత్యేక ముద్ర వేసేందుకు తాపత్రయపడుతున్నారు. ఇందుకోసం వైట్‌హౌస్‌లో తమకు సహకరించే టీమ్‌ను చాలా జాగ్రత్తలతో ఎంపిక చేసుకున్నారు. ముఖ్యంగా ట్రంప్‌ చేసిన తప్పిదాలు చేయకూడదని భావిస్తున్న వీరిద్దరూ... తమ టీమ్‌ కూర్పులో మహిళలు, నల్ల జాతీయులకు ఎనలేని ప్రాధాన్యమిచ్చారు. వీరితో పాటు భారతీయులకూ గణనీయంగా చోటు కల్పించారు. తమకు అధికారం కట్టబెట్టిన ఓటర్ల మనోభావాలను, భవిష్యత్ పరిస్ధితులను దృష్టిలో పెట్టుకుని ఈ టీమ్‌ ఎంపిక జరిగినట్లు తెలుస్తోంది.

అమెరికా కనిపించాలన్న తాపత్రయం

అమెరికా కనిపించాలన్న తాపత్రయం

బైడెన్‌-కమల తమ టీమ్‌ నియామకాల్లో దేశం మొత్తానికి ప్రాతినిధ్యం లభించేలా జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటివరకూ వారు చేసిన నియమాకాల్లో మహిళలతో పాటు నల్ల జాతీయులకూ ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. అలాగని శ్వేత జాతీయులను ఎక్కడా నిరాశపరచలేదు. వైట్‌హౌస్‌కు ఎంపిక చేసిన టీమ్‌లో 61 శాతం మంది మహిళలు ఉండగా.. 54 శాతం మంది నల్ల జాతీయులకు కూడా అవకాశం దక్కింది. తమ టీమ్‌ను చూస్తే అమెరికా కనిపించాలని వీరిద్దరూ చెబుతున్నారు.

సవాళ్లు ఎదుర్కొనే వారికే చోటు..

సవాళ్లు ఎదుర్కొనే వారికే చోటు..


వైట్‌హౌస్‌ కోసం బైడెన్‌-కమల ఎంపిక చేసుకున్న టీమ్‌లో సామాజిక, జాతి, లింగ భేదాలు ఎలా ఉన్నా.. సమర్ధతకే చోటు కల్పించినట్లు అర్ధమవుతోంది. ముఖ్యంగా అమెరికా ప్రస్తుతం ఆర్ధిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. మరోవైపు కరోనా కల్లోలం రేపుతోంది. దేశంలో గన్‌ కల్చర్‌ను అదుపు చేయడం కష్టంగా మారుతోంది. నల్ల జాతీయుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. వీటితో పాటు ట్రంప్ హయాంలో విదేశాలతో తెగిన సంబంధాలు, అంతర్జాతీయ సంస్ధలతో కరవైన సహకారం ఉండనే ఉన్నాయ. వీటిని తిరిగి పాత స్ధితికి తీసుకురావాలంటే వైట్‌హౌస్‌ టీమ్‌ అత్యంత సమర్ధంగా వ్యవహరించాల్సి ఉంటుంది. దీన్ని దృష్టిలో ఉంచుకునే గతంలో అమెరికా ప్రభుత్వాల్లో కీలకంగా వ్యవహరించిన వారికి వీరు బాధ్యతలు అప్పగించారు.

English summary
Sixty-one percent of White House appointees are women and 54 per cent are people of colour, President-elect Joe Biden's transition team said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X