వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పాకిస్థాన్ లోని తేజ్గమ్ రైలులో అగ్నిప్రమాదం, 65 మంది ప్రయాణికులు సజీవదహనం!

|
Google Oneindia TeluguNews

ఇస్లామాబాద్: పాకిస్థాన్ లోని కరాచి-రావల్పిండి తేజ్గమ్ ఎక్స్ ప్రెస్ రైలులో గురువారం జరిగిన అగ్నిప్రమాదంలో 65 మంది ప్రయాణికులు సజీవదహనం అయ్యారు. ఈ ప్రమాదంలో తీవ్రగాయాలైన 13 మంది పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు.

పాకిస్థాన్ లోని కరాచి- రావల్పిండి తజ్గమ్ ఎక్స్ ప్రెస్ రైలు గురువారం రహీం యార్ ఖాన్ రైల్వే స్టేషన్ సమీపంలో లియాకత్ పూర్ దగ్గర వెలుతున్న సమయంలో బోగీల్లో ఆకస్మికంగా మంటలు వ్యాపించాయి. ఒక్కసారిగా బోగీల్లో మంటలు వ్యాపించడంతో ప్రయాణికులు ఆందోళనతో ప్రాణాలు అరచేతిలో పట్టుకుని పరుగులు తీశారు.

 65 people were killed as fire engulfed an express train in Liaqatpur

అయితే ప్రయాణికులు తప్పించుకోవడానికి వీలు లేకుండా మంటలు దట్టంగా వ్యాపించాయి. మంటల నుంచి తప్పించుకోవాడినికి వీలు లేకపోవడంతో ఇప్పటి వరకూ 65 మంది ప్రయాణికులు సజీవదహనం అయ్యారు. గాయాలైన వారిలో 13 మంది ప్రయాణికుల పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు.

 65 people were killed as fire engulfed an express train in Liaqatpur

రైలులో మంటలు వ్యాపించిన సమయంలో ప్రయాణికులు చాల మంది గాడనిద్రలో ఉన్నారని అధికారులు తెలిపారు. ప్రమాధానికి కచ్చితమైన కారణాలు తెలియడం లేదని అధికారులు అంటున్నారు. 2005లొ సింథ్ ప్రాంతంలో రైల్వేస్టేషన్ సమీపంలో రెండు రైళ్లు ఎదురెదురుగా ఢీ కొనడంతో 130 మంది ప్రయాణికులు దుర్మరణం చెందారు. మరో రెండు రైలు ప్రమాదంలో 15 మంది మరణించారు.

English summary
At least 65 people were killed and 13 others suffered injuries as fire engulfed an express train in Liaqatpur near Rahim Yar Khan on Thursday morning, Pakistani media reported.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X