వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పెరూ-బ్రెజిల్ సరిహద్దులో భారీ భూకంపం: 7.1గా తీవ్రత నమోదు

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: పెరూ-బ్రెజిల్‌ సరిహద్దులో భారీ భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టరు స్కేలుపై 7.1 మ్యాగ్నిట్యూడ్‌ తీవ్రత నమోదైందని అమెరికా జియోలాజికల్‌ సర్వే(యూఎస్‌జీఎస్)వెల్లడించింది.

పెరూకు బ్రెజిల్‌తో సరిహద్దు ప్రాంతంలో 609 కిలోమీటర్ల లోతులో భూకంపం వచ్చిందని పేర్కొంది. పెరూలోని ప్యుర్టో మాల్‌డొనాడో నగరానికి దాదాపు 250 కిలోమీటర్ల దూరంలో భూమి కంపించిందని తెలిపింది.

7.1-magnitude quake hits Peru-Brazil border: USGS

అయితే దీని వల్ల కలిగిన నష్టం వివరాలు మాత్రం తెలియలేదు. భూకంప తీవ్రత కారణంగా దేశమంతా భూ ప్రకంపనలు వచ్చాయని పెరూ వాసులు చెబుతున్నారు. ప్రకంపనల వల్ల తమకు కలిగిన అనుభవాలను పలువురు సోషల్‌ మీడియాలో పంచుకుంటున్నారు.

కాగా, పసిఫిక్‌ సునామీ హెచ్చరికల కేంద్రం ఎలాంటి సునామీ హెచ్చరికలు జారీ చెయ్యలేదు. ఈ భూకంపానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

English summary
A powerful 7.1 magnitude earthquake struck along Peru's border with Brazil today, the US Geological Survey said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X