వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మధ్య అమెరికాను వణించిన భూకంపం: జనం పరుగులు

మధ్య అమెరికాను భూకంపం వణికించింది. కరేబియన్ కోస్ట్ ఆఫ్ నికారగువా, కోస్టా రికాలో భారీ తీవ్రతతో భూకంపం సంభవించింది.

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: మధ్య అమెరికాను భూకంపం వణికించింది. కరేబియన్ కోస్ట్ ఆఫ్ నికారగువా, కోస్టా రికాలో భారీ తీవ్రతతో భూకంపం సంభవించింది. రిక్టార్ స్కేల్‌పై భూకంప తీవ్రత 7.0గా నమోదైంది. ఒక్కసారిగా భూమి కంపించడంతో జనం నివాసాల నుంచి బయటికి పరుగులు తీశారు.

ఎల్ సల్వెడార్‌కు 120 కిలో మీటర్ల దూరంలో భూకంప కేంద్రం నమోదైనట్లు యూఎస్ జియాలాజికల్ సర్వే అధికారులు వెల్లడించారు. భారీ ప్రకంపనలతో సునామీ హెచ్చరికలు జారీ చేసినట్లు తెలిపారు. ఈ భూకంపం వల్ల ఎక్కడా ఆస్తి, ప్రాణ నష్టం కలిగినట్లు సమాచారం లేదు.

7.2-Magnitude earthquake rocks El Salvador

తైవాన్‌లోనూ భూకంపం

తైవాన్‌లో శుక్రవారం తెల్లవారుజామున భూకంపంసంభవించింది. రిక్టర్‌ స్కేల్‌పై దీని తీవ్రత 5.4గా నమోదైంది. హ్వాలియాన్‌ నగరానికి పది కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు. ఒక్కసారిగా భూమి కంపించడంతో ప్రజలు భయాందోళనతో బయటికి పరుగులు తీశారు.

ఫిబ్రవరిలో తైనన్‌ నగరంలో 6.4 తీవ్రతతో భూకంపం సంభవించడంతో ఓ అపార్ట్‌మెంట్‌ కాంప్లెక్స్‌ కూలిపోయి 117 మంది మరణించారు. 1999 సెప్టెంబర్‌లో తైవాన్‌లో 7.6 తీవ్రతతో అతి భయంకర భూకంపం సంభవించడంతో 2,400 మంది ప్రాణాలు కోల్పోయారు.

English summary
An earthquake measuring 7.2 on the Richter scale hit El Salvador and neighbouring countries on Thursday, although no damage or injuries have been reported yet, the Environment and Natural Resources Ministry reported.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X