వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మెక్సికోలో భారీ భూకంపం: సునామీ హెచ్చరిక జారీ

|
Google Oneindia TeluguNews

మెక్సికో సిటీ: మెక్సికోలో మంగళవారం భారీ భూకంపం సంభవించింది. రిక్టారు స్కేలుపై భూకంప తీవ్రత 7.7గా నమోదైందని యూఎస్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది. దక్షిణ మెక్సికోలోని పలు ప్రాంతాల్లో భూ ప్రకంపనలు చోటు చేసుకున్నట్లు తెలిపింది.

స్థానిక కాలమానం ప్రకారం మంగళవారం ఉదయం 10.29 గంటలకు ఈ భూకంపం సంభవించిందని వెల్లడించింది. ఆక్సాకా స్టేట్ పసిఫిక్ తీరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు సమాచారం. భూకంప తీవ్రత ఎక్కువగా ఉండటంతో సునామీ హెచ్చరికలు కూడా చేసింది.

 7.7 Earthquake Shakes Buildings In Southern Mexico: Tsunami Alert

ఒక్కసారిగా భూకంపం సంభవించడంతో ప్రజలు తమ నివాసాల నుంచి బయటికి పరుగులు తీశారు. అయితే, ఇప్పటి వరకు భూకంపం కారణంగా ఆస్తి, ప్రాణ నష్టం జరిగినట్లు సమాచారం రాలేదు. భూకంపం కారణంగా ఇళ్లు, భవనాలు, అపార్ట్ మెంట్ల గోడలకు బీటలుపడ్డాయని స్థానికులు వెల్లడించారు.

అయితే, ఎక్కడా కూడా భవనాలు కూలినట్లు సమాచారం లేదని ఆ దేశ మంత్రి ఒకరు వెల్లడించారు. కాగా, 2017లో సెంట్రల్ మెక్సికోలో 7.1 తీవ్రతతో కూడిన భూకంపం సంభవించడంతో 355 మంది చనిపోయారు. భూకంపాలు ఎక్కువగా సంభవించే ప్రాంతంలోనే మెక్సికో దేశం ఉండటం గమనార్హం.

English summary
A powerful earthquake hit the coast of southern Mexico on Tuesday, shaking buildings in Mexico City hundreds of miles away, sending people fleeing their homes into the streets, and triggering a tsunami warning.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X