వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జపాన్‌లో శక్తివంతమైన భూకంపం, ఢిల్లీలో ప్రకంపనలు: జనం పరుగులు

By Srinivas
|
Google Oneindia TeluguNews

టోక్యో/న్యూఢిల్లీ: జపాన్‌లో శక్తివంతమైన భూకంపం వచ్చింది. దేశ రాజధాని ఢిల్లీలోను ప్రకంపనలు వచ్చాయి. శనివారం ఉదయం 7.8 తీవ్రతలో భూమి కంపించింది. భవనాలు, ఇళ్లు ఊగటంతో ప్రజలు రోడ్లపైకి పరుగులు తీశారు.

సునామీ ప్రమాదమేమీ లేదని వాతావరణ శాస్త్రవేత్తలు తెలిపారు. ఒక నిమిషంపాటు ఇంత తీవ్రతతో భూకంపం వచ్చినా ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. దక్షిణ జపాన్‌కు 870 కిలో మీటర్ల దూరంలో భూ ఉపరితలానికి 670 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్టు అమెరికా భూగర్భ శాస్త్రవేత్తలు గుర్తించారు.

 7.8 magnitude earthquake rocks Japan, tremors felt in Delhi, NCR

భూకంపం నేపథ్యంలో టోక్యోలోని నరితా అంతర్జాతీయ విమానాశ్రయంలో రెండు రన్‌వేలను మూసివేశారు. రైల్వే వ్యవస్థను కూడా కాసేపు ఆపేశారు. 2011మార్చిలో జపాన్‌లో వచ్చిన భూకంపం సృష్టించిన విధ్వంసం, మిగిల్చిన ప్రాణ నష్టం మిగిల్చింది.

దీన్ని దృష్టిలో ఉంచుకొని చిన్న కంపానికి కూడా జపనీయులు అప్రమత్తంగా వ్యవహరిస్తారు. అటు జపాన్‌ దక్షిణ భాగంలో ఓ అగ్నిపర్వతం బద్దలైంది. ఇది లావాను వెదజల్లుతుండటంతో స్థానికులను అక్కడినుంచి తరలించారు. మరోవైపు జపాన్‌ భూకంపం ప్రభావం ఢిల్లీలోనూ కనిపించింది. శనివారం సాయంత్రం ఢిల్లీలోని కొన్ని ప్రాంతాల్లో స్వల్పంగా భూమి కంపించటంతో జనాలు అపార్ట్‌మెంట్ల్ల్లలోనుంచి బయటకు వచ్చారు.

English summary
A strong earthquake measuring 7.8 on Richter Scale rocked Japan on Saturday evening.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X