వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆకాశంలో యాక్సిడెంట్: ఇద్దరు చిన్నారులతోపాటు ఏడుగురు మృతి

|
Google Oneindia TeluguNews

మ్యాడ్రిడ్: గగనతలంలో పెను ప్రమాదం చోటు చేసుకుంది. ఓ హెలికాప్టర్, ఎయిర్‌క్రాఫ్ట్ (చిన్నపాటి విమానం) ఢీకొనడంతో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు. స్పెయిన్‌లోని మల్లోర్కా ద్వీపం సమీపంలో ఆదివారం మధ్యాహ్నం ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

స్పెయిన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇద్దరు పైలెట్లతో ప్రయాణిస్తున్న ఓ ఎయిర్‌క్రాఫ్ట్.. ఐదుగురు సభ్యులతో ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌ను ఆకాశంలో ఢీకొంది. ఈ ప్రమాదంలో మొత్తం ఏడుగురు మృతి చెందారు. హెలికాప్టర్‌లో భార్యాభర్తలు సహా వారి ఇద్దరు పిల్లలు, ఓ పైలట్ ఉన్నారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉందని అధికారులు తెలిపారు.

7 dead after small plane and helicopter collide on Spanish Mallorca

ప్రమాదానికి గురైన హెలికాప్టర్ జర్మనీకి చెందినదిగా గుర్తించారు. ఎయిర్ క్రాప్ట్‌లో ప్రయాణిస్తున్న ఇద్దరు పైలట్లు కూడా ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదం జరిగిందనే విషయంపై దర్యాప్తు కొనసాగుతోందని అధికారులు తెలిపారు. మృతులకు కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నట్లు చెప్పారు.

మృతుల వివరాలు తెలుసుకుని వారి కుటుంబసభ్యులు, బంధువులకు సమాచారం ఇస్తామని తెలిపారు. స్పెయిన్ ప్రధాని స్పెర్డో స్పెంచెజ్ కూడా మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రమాదం పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన అధ్యక్షుడు.. మూడు రోజులపాటు అధికారిక సంతాప దినాలను ప్రకటించారు.

స్పెయిన్‌లోని అందమైన దీవుల్లో పర్యటించేందుకు దేశ విదేశాల నుంచి పర్యాటకులు పెద్ద ఎత్తున ఇక్కడికి వస్తుంటారు. వేసవిలో పర్యాటకుల సంఖ్య మరింత ఎక్కువగా ఉంటుంది. పర్యాటకులు దీవుల సందర్శనార్థం వచ్చిన సందర్భంలోనే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.

English summary
Seven people were killed Sunday when a helicopter and a small plane collided in the air above the Spanish island of Mallorca, authorities said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X