వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అలస్కాలో రెండు విమానాలు ఢీ, స్టేట్ లా మేకర్ గ్యారీ నాప్ సహా ఏడుగురి మృతి.. రోడ్డుపై విమాన శకలాలు..

|
Google Oneindia TeluguNews

అమెరికాలోని అలస్కాలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. కెనాయి ద్వీపకల్పం సమీపంలో గల సొల్డొట్నా విమానాశ్రయానికి రెండు మైళ్ల దూరంలో రెండు విమానాలు ఢీ కొన్నాయి. అమెరికా కాలమానం ప్రకారం శుక్రవారం ఉదయం 8.30 గంటలకు ప్రమాదం జరిగిందని పబ్లిక్ సేప్టీ అధికారులు తెలిపారు. ప్రమాదంలో ఏడుగురు చనిపోగా.. వారిలో అలస్కా స్టేట్ లా మేకర్ గ్యారీ నాప్ ఉన్నారు.

విమానాల్లో ఒకటి సింగిల్ ఇంజిన్ గల హవీలాండ్ డీహెచ్‌సీ2 బీవర్, మరొకటి హైపర్-పీఏ 12 ప్లైట్ అని అధికారులు తెలిపారు. ఒక ఇంజిన్ కలిగిన విమానంలో గ్యారీ నాప్ ఒక్కరు ఉండగా.. మరో విమానంలో ఏడుగురు ప్రయాణిస్తున్నారు. ప్రమాదంలో ఏడుగురు చనిపోగా.. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.. అతనిని స్థానిక ఆస్పత్రికి తరలించామని తెలిపారు.

7 Killed, Including State Lawmaker, As Two Planes Collide In Alaska..

Recommended Video

#Watch : CC Tv Footage Of Pakistan Plane Crash & Piolets Last Words Before Crash

ప్రమాదం జరిగే సమయంలో గ్యారీ నాప్ స్వయంగా విమానం నడుపుతున్నారని పబ్లిక్ సేప్టీ అధికారులు వెల్లడించారు. ఒక విమానంలో గ్యారీ ఉండగా.. మరో విమానంలో దక్షిణ కెరొలిన నుంచి నలుగురు పర్యాటకులు ఉన్నారు. కాన్సాస్ నుంచి ఒక గైడ్, సొల్డొట్నా నుంచి పైలట్ ఉన్నారని తెలిపారు. ప్రమాదం స్థలంలోనే ఏడుగురు చనిపోయారు. విమానాల శిథిలాలు రహదారిపై పడిపోవడంతో.. రాకపోకలను నిలిపివేశారు. ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్నామని సేప్టీ బోర్డు తెలిపింది. మరోవైపు నాప్ మృతిపై పలువురు సంతాపం తెలిపారు.

English summary
midair plane collision in Anchorage on Friday killed seven people, including a state lawmaker who was piloting one of the aircraft.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X