వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చైనాలో అల్లకల్లోలం టైఫూన్ మెరాంటి, పలువురి మృతి

|
Google Oneindia TeluguNews

బీజింగ్: చైనాలో టైఫూన్ మెరాంటి అల్లకల్లోలం సృష్టిస్తోంది. టైఫూన్ మెరాంటి కారణంగా దాదాపు పదిమంది వరకు మృతి చెందినట్లుగా తెలుస్తోంది. అలాగే మరో పదిమంది ఆచూకీ లభ్యం కావడం లేదు. దీని కారణంగా లక్షలాది మంది ప్రజలు ఇండ్లను వదిలి ఇబ్బంది పడుతున్నారు. వారిని రెస్క్యూ టీం సురక్షిత ప్రాంతాలకు తరలిస్తోంది.

China

టైఫూన్ మెరాంటీ కారణంగా పుజైన్ ప్రావిన్స్‌లో పరిస్థితి మరీ దారుణంగా తయారయింది. గంట‌కు 370 కి.మీ. వేగంతో పెనుగాలులు వీస్తున్నాయి. అత్య‌ధికంగా ఆ ప్రాంతంలో 400 మి.మీ. వ‌ర్ష‌పాతం నమోదైంది. జనం భయం గుప్పిట బతుకుతున్నారు.

అధికారులు ఎన్ని జాగ్రత్త‌లు తీసుకున్న‌ప్ప‌టికీ టైఫూన్ మెరాంటి ధాటికి పది మంది వరకు మృతి చెందడం గమనార్హం. పదుల సంఖ్యలో మందికి గాయాలయ్యాయి. 1949 తర్వాత ఈ ప్రాంతంలో అత్యంత ప్రభావం చూపింది ఇదే. అలాగే, ప్రపంచంలోనే ఈ ఏడాది ప్రభావితమైన టైఫూన్ ఇదే.

English summary
At least seven persons were killed and nine others left missing after Typhoon Meranti, the world's strongest typhoon this year, hit China's Fujian province and caused widespread devastation, the local government said on Friday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X