వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

coronavirus: ఏడేళ్ల చిన్నారి జర్మనీలో, తల్లి అబుదాబిలో.. నెలరోజులు దూరంగా, చివరికి ఇలా...

|
Google Oneindia TeluguNews

కరోనా వైరస్ తల్లీబిడ్డలను నెలరోజులు దూరం చేసింది. ఆ ఏడేళ్ల పాప పేగుతెంచుకొని జన్మించిన తల్లికి ఖండంతరాల్లో దూరంగా ఉంది. కానీ అధికారుల చొరవతో ఆ పాప ఎట్టకేలకు తల్లి ఒడికి చేరింది. దీంతో ఆ తల్లి ఆనందానికి అవధి లేకుండా పోయింది. పాపను చూసి ఆ తల్లి ఆనందంతో కన్నీరు పెట్టుకున్నది.

coronavirus: కారులోనే డాక్టర్ నిద్ర, వారం రోజుల నుంచి ఇక్కడే, భార్య, పిల్లలకు దూరంగా, సీఎం ప్రశంసలు.coronavirus: కారులోనే డాక్టర్ నిద్ర, వారం రోజుల నుంచి ఇక్కడే, భార్య, పిల్లలకు దూరంగా, సీఎం ప్రశంసలు.

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌కు చెందిన గోడివా గార్ట్కే అనే బాలిక అబుదాబీలో కుటుంబసభ్యులతో కలిసి ఉంటోంది. గార్ట్కే అమ్మమ్మ జర్మనీలో ఉంటారు. కరోనా వైరస్ నేపథ్యంలో స్కూల్‌కి హాలీడేస్ ఇచ్చారు. దీంతో తన అమ్మమ్మ ఇంటికి వెళ్లింది. మార్చి మొదటి వారంలో జర్మనీ వెళ్లిన చిన్నారి.. అక్కడే ఉండిపోయింది. మార్చి 16వ తేదీ నుంచి విమాన రాకపోకలు నిలిచిపోయాయి. షెడ్యూల్ ప్రకారం 22వ తేదీ రావాల్సిన చిన్నారి.. తల్లికి దూరంగానే ఉన్నారు. అలా నెలరోజులు గడిపింది.

7 year old girl reunited with family in abu-dhabi

గార్ట్కే తల్లి విక్టోరియా తన చిన్నారిని స్వదేశం తీసుకొచ్చేందుకు విశ్వప్రయత్నాలు చేశారు. యూఏఈ రాయబార కార్యాలయా అధికారులు సంప్రదించగా.. విషయాన్ని విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖకు విషయాన్ని తీసుకెళ్లారు. ఇరుదేశాల దౌత్యవేత్తలతో సంప్రదింపులు జరిపారు. ఇరుదేశాల సంప్రదింపుల నేపథ్యంలో.. చివరికి చిన్నారి సోమవారం అబుదాది చేరుకున్నది. తన కూతురు రావడతో ఆ తల్లి ఆనంద బాష్పాలు రాల్చింది.

English summary
7 year old girl reunited with family in abu-dhabi after one month ago
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X