వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఫ్యాషన్ కోసం చర్మం: 70 మొసళ్ల తలల నరికివేత

|
Google Oneindia TeluguNews

సిడ్నీ: వ్యాపారం కోసం వన్యప్రాణులను అతి దారుణంగా చంపేస్తున్నారు. ఆస్ట్రేలియాలో ఏకంగా 70 మొసళ్ల తలలు నరికి వాటి చర్మాన్ని తీసుకు వెళ్లారు. విషయం తెలుసుకున్న స్థానికులు వన్యప్రాణి సంరక్షణ అధికారులకు సమాచారం అందించారు.

ఉత్తర ఆస్ట్రేలియాలోని హంటీ డూ అనే ప్రాంతంలో కొందరు గుర్తు తెలియన వ్యక్తులు ఒక ఫ్రీజర్ విసిరివేసి వెళ్లారు. స్థానికంగా నివాసం ఉంటున్న పిల్లలు ఆడుకుంటున్న సమయంలో ఆ ఫ్రీజర్ ను తీశారు. అంతే పిల్లలు హడలిపోయారు.

Crocodile

ఫ్రీజర్ లో రక్తం కారుతున్న మొసళ్ల తలలు దర్శనం ఇచ్చాయి. పిల్లలు వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న పోలీసు అధికారులు, అటవి శాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.

ఫ్రీజర్ లో 70 మొసళ్ల తలలు ఉన్నాయని అధికారులు అన్నారు. ఆస్ట్రేలియాలో మొసళ్లు క్షీణిస్తున్న జాతిగా గుర్తించారు. ఎవరైనా మొసళ్లను చంపితే 5 సంవత్సరాలు జైలుకు పంపించి కఠినంగా శిక్షిస్తారు. కొన్ని ప్రాంతాలలో నివాసం ఉంటున్న వారు వారి ఆత్మరక్షణ కోసం మొసళ్లను చంపడానికి అధికారులు అనుమతి ఇచ్చారు.

అంతర్జాతీయ ఫ్యాషన్ రంగంలో మొసలి చర్మానికి మంచి గిరాకి ఉందని అధికారులు చెప్పారు. ఫ్యాషన్ రంగానికి చెందిన కొందరు దుండగుల సహకారంతో మొసళ్లను చంపి వాటి చర్మాలను తీసుకుని వెళ్లారని పోలీసు అధికారులు తెలిపారు.

English summary
Up to 70 rotting crocodile heads have been found in an old freezer dumped at a remote Australian town, police said today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X