వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రపంచంలోనే తొలిసారి: ఆరు ఫ్లేవర్లలో ఒంటె పాలతో ఐస్ క్రీమ్

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ప్రపంచంలో తొలిసారి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌కు చెందిన పాల ఉత్పత్తుల సంస్ధ 'అల్ ఐన్ డైరీ' ఒంటె పాలతో ఐస్ క్రీమ్, ఇతర పాల ఉత్పత్తులను తయారు చేసింది. అల్ ఐన్ డైరీ అధికారకంగా ఒంటె పాల ఉత్పత్తలను "కామలైట్" బ్రాండ్ పేరుతో రిటైల్ మార్కెట్లోకి విడుదల చేసింది.

ఒంటె పాలతో ఉత్పత్తులను విడుదల చేయడం పట్ల అల్ ఐన్ డైరీ సీఈఓ అబ్దుల్లా సైఫ్ అల్ దార్మకీ మాట్లాడుతూ ఈ రంగంలో తాము గొప్ప విజయాన్ని సాధించినట్లు తెలిపారు. ఐస్ క్రీమ్ తయారీలో ఒంటెపాలు పాశ్చరైజేషన్ చాలా క్లిష్టమైనదని, ఆ సవాలును అధిగమించామని ఆయన చెప్పారు.

ఈ ఒంటెపాల ఐస్ క్రీమ్‌లో ఖర్జూరం, కుంకుమపువ్వు, ఇలాచీ, చాక్లెట్, కార్మెల్, వెనీలాలాంటి ఆరు ఫ్లేవర్లను ఐస్ క్రీమ్ ప్రియులకు అందుబాటులోకి తీసుకొచ్చామని ఆయన అన్నారు. వీటితో పాటు మార్కెట్లోకి ఒంటె పాల పౌడర్‌ను కూడా అందుబాటులోకి తీసుకొచ్చామని తెలిపారు. సాధారణంగా యూరోపియన్, నార్త్ అమెరికన్ మార్కెట్లో సహజ పుష్టికరమైన ఉత్పత్తులకు మంచి డిమాండ్ ఉందని అన్నారు.

ఒంటె పాలతో తయారు చేసిన ఉత్పత్తులను తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిదని వైద్య నిపుణలు భావిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఒంటె పాలతో ఉత్పత్తి చేసిన ఉత్పత్తులను అందరికీ అందేలా చేయాలనేది తమ ఉద్దేశమని అల్ దార్మకీ అన్నారు. అల్ ఇన్ డైరీ పేరిట ఒంటె పాలతో ఉత్పత్తులను 2004లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో ప్రారంభించారు.

English summary
The disrobed body of a 75-year-old woman inmate of an ashram was found on Wednesday at Katwa, 60 km from here, fuelling allegations of a second rape of a senior citizen in West Bengal in a week.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X