హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సౌదీలో కరోనా కాటుకు బలైన 8 మంది భారతీయులు వీళ్లే.. తెలంగాణ నుంచి ఒకరు..

|
Google Oneindia TeluguNews

కరోనా వైరస్ కారణంగా సౌదీ అరేబియాలో 8 మంది భారతీయులు మృతి చెందినట్టు అక్కడి మీడియా వర్గాలు వెల్లడించాయి. మృతుల్లో మక్కాలో ఎలక్ట్రికల్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న మహమ్మద్ అస్లమ్ ఖాన్,మక్కాలోనే పనిచేస్తున్న మరో ఇంజనీర్ అజ్మతుల్లా ఖాన్ ఉన్నారు. కేరళ,ఉత్తరప్రదేశ్,మహారాష్ట్రలకు చెందిన మరో ఆరుగురు వ్యక్తులు కూడా కరోనా బారినపడి మృతి చెందారు. వీరి మృతదేహాలను అక్కడే ఖననం చేశారు. అలాగే కుటుంబ సభ్యులను హోమ్ క్వారెంటైన్ చేసినట్టు సమాచారం.

మృతుల్లో తెలంగాణ వ్యక్తి ఒకరు..

మృతుల్లో తెలంగాణ వ్యక్తి ఒకరు..

అస్లమ్ ఖాన్(51) స్వస్థలం భారత్‌లోని ఉత్తరప్రదేశ్‌లో ఉన్న మీరట్. సౌదీలో పనిచేస్తున్న అస్లమ్‌కు కరోనా సోకి ఆరోగ్యం విషమించడంతో ఏప్రిల్ 3న మక్కాలోని కింగ్ ఫైజల్ ఆసుపత్రిలో చేర్చారు. అక్కడ రెండు వారాల పాటు వెంటిలేటర్‌పై చికిత్స అందించగా.. గత శనివారం (ఏప్రిల్ 18)న అతను కన్నుమూశాడు. ఖాన్‌కి భార్య,ఒక కుమార్తె,ఒక కుమారుడు ఉన్నారు. ప్రస్తుతం వీరంతా హోమ్ క్వారెంటైన్‌లో ఉన్నారు.మరో మృతుడు అజ్మతుల్లా ఖాన్(65) కరోనా వైరస్‌కు చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. ఇతను తెలంగాణ రాష్ట్రానికి చెందినవాడు. ఖాన్ మృతదేహాన్ని ఆదివారం మక్కాలో ఖననం చేసినట్లు ప్రముఖ భారత సామాజిక కార్యకర్త, కేరళ ముస్లిం కల్చరల్ సెంటర్ మక్కా చాప్టర్ ప్రధాన కార్యదర్శి ముజీబ్ పుక్కట్టూర్ వెల్లడించారు.

ఇంకా ఎవరెవరు...

ఇంకా ఎవరెవరు...

భారత్‌కు చెందిన ఫక్రే ఆలమ్ అనే మరో ఉద్యోగి కూడా కరోనా సోకి ఆదివారం మక్కాలో మృతి చెందాడు. ఇతను సౌదీ బిన్‌లాదిన్ గ్రూపు ప్రాజెక్టు ఆధ్వర్యంలోని హారమ్ ప్రాజెక్ట్‌లో పనిచేస్తున్నాడు. మెదీనాలో ఎలక్ట్రిక్ టెక్నీషియన్‌గా పనిచేస్తున్న భారత్‌కు చెందిన బర్కత్ అలీ అబ్దుల్లాతీఫ్ కూడా కరోనాతో మృతి చెందాడు. ఇప్పటివరకు సౌదీలో మృతి చెందినవాళ్లలో భారత్‌లోని హైదరాబాద్‌కి చెందిన మహమ్మద్ సాదిఖ్,మహారాష్ట్రకు చెందిన సయ్యిద్ జునైద్ కూడా ఉన్నారు. సౌదీ మంత్రిత్వ శాఖ ఏప్రిల్ 14న వెల్లడించిన వివరాల ప్రకారం సౌదీ బిన్‌లాదిన్ గ్రూపు ఆధ్వర్యంలోని వివిధ ప్రాజెక్టుల్లో పనిచేస్తున్న 117 మందికి కరోనా సోకింది. ఇందులో ఒక్క మక్కా పరిధిలోనే 70 కేసులు నమోదయ్యాయి.

Recommended Video

World May Not Have Space To Store Crude Oil
కేరళకు చెందిన ఇద్దరు..

కేరళకు చెందిన ఇద్దరు..

కేరళకు చెందిన షెబ్‌నాజ్ పాల కండియిల్ (29), సఫ్‌వాన్ నాదమల్ (41)ల మరణంతో ఈ నెల మొదట్లో మదీనా, రియాద్‌లలో మొదటి రెండు భారతీయ మరణాల కేసులు చోటు చేసుకున్నాయి. షెబ్‌నాజ్‌కు ఈ ఏడాది జనవరిలోనే వివాహం జరిగింది. కేరళలోని కన్నూరు జిల్లా పనూర్‌కు చెందిన అతను.. వివాహం జరిగిన రెండు నెలలకే మార్చి 3న సౌదీకి వెళ్లాడు. కరోనా బారినపడి ఏప్రిల్ 3న అక్కడే మృతి చెందగా మెదీనాలో అతని మృతదేహాన్ని ఖననం చేశారు. ఇక సఫ్‌వాన్ కేరళలోని మలప్పురంకి చెందిన ఓ ట్యాక్సీ డ్రైవర్. కరోనా బారినపడి ఏప్రిల్ 2న అతను మృతి చెందగా ఏప్రిల్ 8న రియాద్‌లో అతని మృతదేహాన్ని ఖననం చేశారు.

English summary
8 Indians, including 1 Hyderabadi, die of coronavirus in Saudi arabia.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X