వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పెషావర్‌లో పేలుడు: జర్నలిస్టుతోపాటు 11మంది మృతి

|
Google Oneindia TeluguNews

పెషావర్: పాకిస్థాన్‌లోని పెషావర్ మరోసారి బాంబు పేలుడుతో దద్దరిల్లింది. జమ్రూద్ ఖైబర్ ఏజెన్సీ కర్ఖానో మార్కెట్ ప్రాంతంలో చెక్ పోస్టు సమీపంలో ఈ భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదం 11మంది మృతి చెందగా, మరో 22 మందికి తీవ్ర గాయాలయ్యాయి.

ఈ మేరకు వివరాలను హయతాబాద్ మెడికల్ కాంప్లెక్స్ అధికారులు తెలిపారు. ఓ చిన్నారితోపాటు నలుగురు భద్రతాధికారులు కూడా మృతుల్లో ఉన్నారని చెప్పారు. జమ్రూద్ ఖసదార్ లైన్ అధికారి నవాబ్ షా కూడా ఈ దాడిలో మృతి చెందినట్లు సమాచారం.

8 killed, 22 injured in Peshawar check post blast

మోటర్ బైక్‌లో బాంబు పెట్టి పేల్చినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. అయితే ఇది ఆత్మాహుతి దాడా? లేక రిమోట్‌తో బాంబును పేల్చారా? అనేది తేలాల్సి ఉంది. బాంబు పేలుడుతో భారీ మంటలు వ్యాపించాయి.

దీంతో అక్కడ కార్లు, ఇతర వాహనాలు దగ్ధమయ్యాయి. ఆజ్ టీవీ జర్నలిస్ట్ మెహబూబ్ షా అఫ్రిదీ కూడా ఈ బాంబు పేలుళ్ల ఘటనలో మృతి చెందాడు. కాగా, గతంలో పెషావర్‌లోని ఓ పాఠశాలలో ఉగ్రవాదులు జరిపిన దాడిలో సుమారు 150మందికి పైగా విద్యార్థులు, సిబ్బంది మృతి చెందిన విషయం తెలిసిందే.

English summary
At least eight people were killed and 22 others injured as a bomb exploded near a check post in Peshawar’s Karkhano Market, adjacent to Jamrud in Khyber Agency on Tuesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X