వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టార్గెట్ అమెరికా: ఇరాన్ క్షిపణి దాడుల్లో 80 మంది మృతి.. యుద్ధం ప్రారంభమైందా..?

|
Google Oneindia TeluguNews

Recommended Video

#IRANvsUSA : Indians In Iraq, Be Alert || Oneindia Telugu

ఇరాన్: ఇరాక్‌ అమెరికా మధ్య యుద్ధవాతావరణం అలుముకుంది. ఇరాన్ ఆర్మీ చీఫ్ ఖాసింను అమెరికా వైమానిక దళాలు దాడులు చేసి మట్టుబెట్టడంతో ఇరాన్ ప్రతీకారచర్యలకు దిగింది. ఇందులో భాగంగానే ఇరాన్ అమెరికా బలగాలు ఉన్న స్థావరంపై క్షిపణి దాడితో విరుచుకు పడింది. ఈ దాడిలో 80 మంది మృతి చెందినట్లు సమాచారం. 80 మంది మృతి చెందారనే వార్తను ఇరాన్ మీడియా ప్రసారం చేసింది. మృతుల సంఖ్యపై కచ్చితమైన సమాచారం లేదా అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు. ఇదిలా ఉంటే అమెరికా బలగాలకు క్షిపణి దాడిపై ముందస్తు సమాచారం ఉండటంతో అక్కడి నుంచి అమెరికా బలగాలు మరో చోటికి మారినట్లు తెలుస్తోంది. ముందస్తు సమాచారం మంచి ఫలితాన్ని ఇచ్చిందంటూ అమెరికా ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.

ఇరాన్ ప్రతీకార దాడి: అమెరికా కీలక నిర్ణయాలు: గల్ఫ్ దేశాల మీదుగా పౌర విమానాలు బంద్.. !ఇరాన్ ప్రతీకార దాడి: అమెరికా కీలక నిర్ణయాలు: గల్ఫ్ దేశాల మీదుగా పౌర విమానాలు బంద్.. !

అంతకుముందు ఇరాన్ డజనుకుపైగా క్షిపణులతో అమెరికా బలగాలు తిష్టవేసి ఉన్న స్థావరాలపై విరుచుకుపడ్డాయి.ఇరాక్‌లోని రెండు ఎయిర్‌బేస్‌లపై క్షిపణి దాడి చేసింది ఇరాన్. ఈ దాడిలో ఎలాంటి ప్రాణ నష్టం లేదని అమెరికా ఓ వైపు చెబుతున్నప్పటికీ ఇరాన్ ప్రభుత్వ వార్తా ఛానెల్ మాత్రం 80 మంది అమెరికా సైనికులు మృతి చెందినట్లుగా కథనాలను ప్రసారం చేసింది. అమెరికా సైన్యంను ఉగ్రవాదులుగా ఆ మీడియా పేర్కొంది. ఇరాన్ 15 క్షిపణులను ప్రయోగించిందని పేర్కొంది. ఒక వేళ అమెరికా ప్రతీకారచర్యలకు దిగితే మరో 100 స్థావరాలపై దాడులు చేస్తామని ఇరాన్ హెచ్చరించింది.

80 killed in Iran attack over US airbase in Iraq,says state media

ఇరాన్ చేసిన క్షిపణి దాడుల్లో అమెరికాకు చెందిన హెలికాఫ్టర్లు ఇతర మిలటరీ సామగ్రి ధ్వంసమయ్యాయని మీడియా కథనాలను ప్రసారం చేసింది. మరోవైపు ఇరాక్‌లో ఉన్న భారతీయులకు ఎలాంటి ప్రమాదం జరగలేదని ఐక్యరాజ్యసమితిలో బాధ్యతలు నిర్వర్తిస్తున్న భారత అధికారి ఒకరు వెల్లడించారు. ఇరాక్‌లో దాదాపు 25వేల మంది భారతీయులు నివసిస్తున్నారు. వారంతా ఆయిల్ పరిశ్రమల్లో పనిచేస్తున్నారు. ఇందులో ఎక్కువ మంది కుర్దిస్తాన్‌ రాజధాని ఎర్బిల్‌లో నివాసముంటూ వ్యాపారం చేస్తున్నారు. ఇరాక్‌లో నెలకొన్న యుద్ధ వాతావరణం దృష్ట్యా ఆ దేశానికి వెళ్లాలన్న ఆలోచనను దేశ ప్రజలు విరమించుకోవాలని విదేశాంగ శాఖ ప్రతినిధి రవీష్ కుమార్ ట్వీట్ చేశారు. ఇరాక్‌లో ఉన్న భారతీయులు ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలపై చాలా జాగ్రత్తతో ఉండాలని చెప్పారు.

English summary
Iranian state television said at least 80 "American terrorists" were killed in attacks involving 15 missiles Tehran launched on US targets in Iraq, adding that none of the missiles were intercepted.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X