వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రపంచానికి 'ఫైజర్' గుడ్ న్యూస్.. వ్యాక్సిన్ తయారీలో కీలక మైలురాయిని చేరిన మొట్టమొదటి కంపెనీ...

|
Google Oneindia TeluguNews

కరోనా వ్యాక్సిన్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ప్రపంచమంతా ఆతృతగా ఎదురుచూస్తున్న తరుణమిది. కరోనా సెకండ్ వేవ్ ప్రపంచ దేశాలను మరింత వణికిస్తున్న నేపథ్యంలో... వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తేనే ఈ గండాన్ని గట్టెక్కడం సాధ్యం. లేనిపక్షంలో మొదటి దశ కరోనా వేవ్ కంటే రెండో దశలో ఎక్కువ నష్టం జరిగే ప్రమాదం ఉంది. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా చాలా వ్యాక్సిన్లు ఇప్పుడిప్పుడే మూడో దశ ప్రయోగాలను ఎదుర్కొంటున్నాయి. వీటిల్లో ఏవి ఎంతమేర సత్ఫలితాలను ఇస్తాయన్న దానిపై కరోనాతో పోరాటం ఆధారపడి ఉంటుంది. ఈ నేపథ్యంలో అమెరికా ఫార్మా కంపెనీ 'ఫైజర్' గుడ్ న్యూస్ చెప్పింది.

అలా... మొట్టమొదటి కంపెనీ...

అలా... మొట్టమొదటి కంపెనీ...

తాము అభివృద్ది చేసిన కరోనా వ్యాక్సిన్.. తుది దశ ప్రయోగాల్లో 90శాతం కన్నా ఎక్కువ ప్రభావవంతమైన ఫలితాలనిచ్చిందని ఫైజర్ ఫార్మాసూటికల్స్‌ వెల్లడించింది. తమ భాగస్వామ్య సంస్థ అయిన జర్మన్ బయోఎన్‌టెక్‌తో కలిసి ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. భారీ ఎత్తున మూడో దశ క్లినియకల్ ప్రయోగాలను చేపట్టి... ఈ స్థాయిలో సానుకూల ఫలితాలు పొందిన మొట్టమొదటి ఔషధ కంపెనీగా ఫైజర్ గుర్తింపు దక్కించుకుంది.

ఫైజర్ ఛైర్మన్ ఏమంటున్నారు...

ఫైజర్ ఛైర్మన్ ఏమంటున్నారు...

'సైన్స్‌కు,మానవ సమాజానికి ఇది చాలా గొప్ప రోజు...' అని ఫైజర్ ఛైర్మన్ అల్బర్ట్ బౌర్లా పేర్కొన్నారు. ఓవైపు ఆస్పత్రులన్నీ పేషెంట్లతో నిండిపోయి... వాటి సామర్థ్యం సరిపోవట్లేదు... మరోవైపు ప్రపంచవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి... ఇలాంటి తరుణంలో వ్యాక్సిన్ అభివృద్దిలో మేము కీలకమైన మైలురాయిని చేరుకున్నాం.' అని ప్రకటించారు. బయోఎన్‌టెక్ సహ వ్యవస్థాపకుడు,ఆ సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఉగుర్ సహిన్ కూడా ఈ వ్యాక్సిన్‌పై ఆశాభావం వ్యక్తం చేశారు. తాము అభివృద్ది చేసిన వ్యాక్సిన్ కరోనా నివారణలో కనీసం ఏడాది పాటు సమర్థవంతంగా పనిచేస్తుందన్నారు.

ఎమర్జెన్సీ వాడకానికి ఫైజర్?

ఎమర్జెన్సీ వాడకానికి ఫైజర్?

ప్రస్తుతం ఇంకా ఫైజర్ తుది దశ ప్రయోగాలు కొనసాగుతున్నప్పటికీ... ప్రపంచం మెడికల్ ఎమర్జెన్సీని ఎదుర్కొంటున్న నేపథ్యంలో... అత్యవసర వాడకానికి ఫైజర్ ఆయా ప్రభుత్వాల అనుమతి కోరే అవకాశం ఉంది. ప్రస్తుతం అమెరికాలో పరిస్థితి అంతకంతకూ దిగజారుతుండటంతో... మొదట ఆ దేశంలోనే ఫైజర్‌ వ్యాక్సిన్‌ను అత్యవసర వాడకానికి ఉపయోగించే అవకాశం కనిపిస్తోంది. 16ఏళ్ల నుంచి 85ఏళ్ల లోపువారికి వ్యాక్సిన్ ఇవ్వడంపై ఫైజర్ అమెరికా ప్రభుత్వంతో చర్చించే అవకాశం ఉంది. అయితే ఇందుకోసం గత 2నెలలుగా 44వేల మంది వాలంటీర్లపై జరిపిన ప్రయోగాలకు సంబంధించి సేఫ్టీ డేటాను ఫైజర్ సేకరించాల్సి ఉంటుంది.

తొలి దశలో పరిమిత సంఖ్యలోనే...

తొలి దశలో పరిమిత సంఖ్యలోనే...

ఒకవేళ ఎమర్జెన్సీ వాడకానికి గ్రీన్ లభిస్తే... తొలి దశలో కేవలం పరిమిత సంఖ్యలో మాత్రమే వ్యాక్సిన్ డోసులను ఉత్పత్తి చేయనున్నారు. ఏడాది పాటు వ్యాక్సిన్ ప్రభావవంతంగా పనిచేయగలదని ఫైజర్ కంపెనీ చెప్తున్నప్పటికీ... దీని సామర్థ్యానికి సంబంధించి ప్రశ్నలైతే లేకపోలేదు. 2021 చివరి నాటికి 130 కోట్ల వ్యాక్సిన్ డోసుల్ని ఉత్పత్తి చేసేందుకు ఫైజర్ సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. ఆ సమయానికి ఆస్ట్రాజెనెకా,కోవ్యాక్సిన్ తదితర వ్యాక్సిన్లు కూడా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

English summary
American pharmaceutical Pfizer Inc and its German partner BioNTech SE on Monday said that early data has shown that their Covid-19 vaccine is more than 90 per cent effective in preventing Covid-19.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X