వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రపంచంలోనే కరోనా వ్యాక్సిన్ తొలి ఇంజెక్షన్: 90 ఏళ్ల వయోధిక వృద్ధురాలికి: ఎవరామె?

|
Google Oneindia TeluguNews

లండన్: ప్రాణాంతక కరోనా వైరస్ మహమ్మారిని నిర్మూలించే దిశగా తొలి అడుగు పడింది. ఫైజర్ రూపొందించిన వ్యాక్సిన్‌ను బ్రిటన్ ప్రభుత్వం సాధారణ ప్రజల కోసం వినియోగంలోకి తీసుకొచ్చింది. వ్యాక్సినేషన్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. మొట్టమొదటి వ్యాక్సిన్‌ను మార్గరెట్ కీనన్ అలియాస్ మ్యాగీ అనే వయోధిక వృద్ధురాలికి ఇచ్చారు. ఇంజెక్షన్ రూపంలో ఆమెకు వ్యాక్సిన్‌ను శరీరంలోకి పంపించారు. ఆమె వయస్సు 90 సంవత్సరాలు. మరో వారం రోజుల్లో తన 91వ పుట్టినరోజును కీనన్ జరుపుకోనున్నారు.

టీవీ నటిని పొట్టనబెట్టుకున్న కరోనా మహమ్మారి: వెంటిలేటర్‌పై చికిత్స అందించినాటీవీ నటిని పొట్టనబెట్టుకున్న కరోనా మహమ్మారి: వెంటిలేటర్‌పై చికిత్స అందించినా

కోవెంట్రీ ఆసుపత్రిలో..

కోవెంట్రీ ఆసుపత్రిలో..

కరోనా వైరస్ బారిన పడిన మార్గరెట్ కీనన్.. కొంతకాలంగా సెంట్రల్ లండన్‌లోని కోవెంట్రీలోని స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆమెకు తొలి వ్యాక్సిన్‌ను ఇచ్చారు డాక్టర్లు. బ్రిటన్ కాలమానం ప్రకారం.. మంగళవారం తెల్లవారు జామున సరిగ్గా 6:30 గంటలకు మార్గరెట్ కీనన్‌కు వ్యాక్సిన్ ఇచ్చారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రపంచంలోనే తొలి కరోనా వ్యాక్సిన్‌ను అందుకున్న మహిళగా గుర్తింపు పొందారామె.

ఫిలిప్పీన్స్‌కు చెందిన నర్స్ చేతుల మీదుగా..

ఫిలిప్పీన్స్‌కు చెందిన నర్స్ చేతుల మీదుగా..

ఫిలిప్పీన్స్‌కు చెందిన నర్స్ ఒకరు మార్గరెట్ కీనన్‌కు కరోనా వ్యాక్సిన్‌తో కూడిన ఇంజెక్షన్‌ను ఇచ్చారు. ఆ సమయంలో కొన్ని టీవీ ఛానళ్లను కవరేజీ కోసం అనుమతించారు. వ్యాక్సిన్‌ తీసుకున్న అనంతరం కీనన్.. కొద్దిసేపు విలేకరులతో మాట్లాడారు. మరో వారం రోజుల్లో తాను పుట్టినరోజు వేడుకలను జరుపుకోబోతున్నానని, అలాంటి సమయంలో.. తొలి వ్యాక్సిన్ కోసం తనను ఎంచుకోవడం.. గొప్ప అనుభూతిని ఇస్తోందని అన్నారు. తన జన్మదినోత్సవానికి ఇంతకంటే మంచి బహుమతి ఉండబోదని వ్యాఖ్యానించారు.

ఫైజర్ సరికొత్త రికార్డ్..

ఫైజర్ సరికొత్త రికార్డ్..

అమెరికాకు చెందిన ఫైజర్ ఫార్మాసూటికల్స్ సంస్థ రూపొందించిన వ్యాక్సిన్ ఇది. జర్మనీకి చెందిన బయోఎన్‌టెక్ సహకారంతో దీన్ని అభివృద్ది చేసింది. మూడు దశల్లో క్లినికల్ ట్రయల్స్‌ను నిర్వహించింది. 95 శాతం మేర సత్ఫలితాలను ఇచ్చినట్లు ఫైజర్.. తన క్లినికల్ ట్రయల్స్ సమయంలోనే ప్రకటించింది. అనంతరం బ్రిటన్ ప్రభుత్వానికి అనుమతి కోసం ప్రతిపాదనలను పంపించింది. క్లినికల్ డేటాను షేర్ చేసింది. వాటిని పరిశీలించిన తరువాత.. బ్రిటన్ ప్రభుత్వం సాధారణ ప్రజల కోసం ఈ వ్యాక్సిన్‌ను వినియోగించడానికి అనుమతి ఇచ్చింది.

అనుమతి ఇచ్చిన వారం రోజుల్లోనే..

అనుమతి ఇచ్చిన వారం రోజుల్లోనే..

ఫైజర్-బయోఎన్‌టెక్ వ్యాక్సినేషన్ కోసం ఈ నెల 2వ తేదీన బ్రిటన్ హెల్త్ రెగ్యులేటరీ ఆదేశాలను జారీ చేయగా.. సరిగ్గా వారం రోజుల్లోనే దీన్ని అమల్లోకి తీసుకొచ్చారు. వ్యాక్సిన్ ఇవ్వడాన్ని ప్రారంభించారు. ప్రాధాన్యత క్రమంలో వ్యాక్సిన్‌ను ఇచ్చుకుంటూ వెళ్తారు. 70 సంవత్సరాలు పైబడిన వృద్ధులకు తొలి డోసులను అందజేస్తారు. అనంతరం ఫ్రంట్‌లైన్ వారియర్లు, క్రమంగా పిల్లలు, మహిళలు అనంతరం 50 సంవత్సరాలు పైనున్న వయస్సు గల కరోనా పేషెంట్లకు వ్యాక్సిన్‌ను ఇస్తారు.

డిసెంబర్ 25న అనుకున్నా..

డిసెంబర్ 25న అనుకున్నా..

అత్యవసర పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని నిర్దేశిత గడువు కంటే ముందే.. ఈ వ్యాక్సిన్‌ వినియోగానికి అనుమతి ఇచ్చింది బ్రిటన్ రెగ్యులేటరీ. నిజానికి- క్రిస్మస్ సందర్భంగా ఈ నెల 25వ తేదీన ప్రారంభించాలని ప్రణాళికలను రూపొందించుకుంది. అత్యవసర పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని, వెంటనే అందుబాటులోకి తీసుకుని రావాలని బ్రిటన్ ప్రభుత్వం నిర్ణయించుకుంది. 95 శాతం మేర తమ వ్యాక్సిన్ ప్రభావం చూపుతుందని ఇదివరకే ఫైజర్ కంపెనీ ప్రకటించిన విషయం తెలిసిందే.

Recommended Video

#Telangana : Congress పార్టీకి షాక్ ఇచ్చి BJP తీర్థం పుచ్చుకున్న Vijayashanti

English summary
Margaret Keenan, a 90-year-old grandmother, on Tuesday became the first person in the world to receive the Pfizer COVID-19 vaccine shot outside of a trial as Britain began vaccinating its population. Keenan received the vaccine at her local hospital in Coventry, central England.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X