వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

92 ఏళ్ల బామ్మ 26 మైళ్ల మారథాన్: గిన్నీస్ రికార్డు

|
Google Oneindia TeluguNews

అమెరికా: కుర్రకారుకు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చారు ఒక బామ్మ, యువతతో పోటి పడిన 92 సంవత్సరాల బామ్మ ఏకంగా 26 మైళ్లు పరిగెత్తారు. మారథాన్ లో పాల్గోన్న వారందరు షాక్ కు గురైనారు. ఆమెతో పాటు పరుగు తీసిన వారు అలసిపోయినా ఆమె మాత్రం చిరునవ్వుతోనే స్థానిక మీడియాతో మాట్లాడారు.

హరియోట్టి థామ్సన్ (92) అనే బామ్మ గిన్నీస్ బుక్ లో చోటు సంపాదించుకున్నారు. ఈమె వయస్సు 92 సంవత్సరాల 65 రోజులు. దక్షిణ కాలిఫోర్నియాలో మారథాన్ నిర్వహించారు. ఈ మారథాన్ లో థామ్సన్ పాల్గోన్నారు.

26 మైళ్ల మారథాన్ లో బామ్మ ఉల్లాసంగా పాల్గొన్నారు. 26 మైళ్లను 7 గంటల 24 నిమిషాల 36 సెంకడ్లలో చేరుకున్నారు. తరువాత ఆమె స్ధానిక మీడియాతో మట్లాడారు. 26 మైళ్ల మారథాన్ లో పాల్గొన్నందుకు సంతోషంగా ఉందని చెప్పారు.

 92-year-old woman to complete marathon after finishing race in america

26 మైళ్లు తనకు తోడుగా తన కుమారుడు బ్రెన్నీ ఉన్నాడని, అప్పుడప్పుడు కార్బోహైడ్రేట్స్ ఇస్తూ తనను ప్రోత్సహించాడని అన్నారు. గతంలో 92 సంవత్సరాల 19 రోజులు వయస్సు ఉన్న గ్లేడిస్ బర్రిల్ అనే బామ్మ 2010లో హోనలు ప్రాంతంలో నిర్వహించిన మారథాన్ పూర్తి చేసి గిన్నీస్ బుక్ లో చోటు సంపాదించారు.

గ్లేడిస్ బర్రిల్ అమెరికాకు చెందిన వారే. ఆమె రికార్డును థామ్సన్ బ్రేక్ చేసి గిన్నీస్ బుక్ లో చోటు సంపాదించారు. క్యాన్సర్ పై పరిశోదనలు చెయ్యడానికి నిధులు సేకరించడానికి ఈ మారథాన్ నిర్వహించారు. మొత్తం మీద బామ్మ రికార్డు సృష్టించారు.

English summary
Harriette Thompson (92) of Charlotte, North Carolina, completed Sunday's Rock 'n' Roll Marathon in San Diego in 7 hours, 24 minutes, 36 seconds. She was mobbed by well-wishers as she crossed the finish line.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X