వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సైకలాజికల్ స్టూడెంట్‌కు ఒకేసారి ఆరు డోసుల కరోనా వ్యాక్సిన్ ఎక్కించేశారు: ఆ తరువాతేమైంది?

|
Google Oneindia TeluguNews

రోమ్: కరోనా వ్యాక్సిన్ ఒక డోసు తీసుకోవాలంటే.. చాలామంది ఇప్పటికీ వెనుకాడుతున్నారు. సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయనే భయం చాలామందిలో ఉంది. వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవంటూ ప్రభుత్వాలు చెబుతోన్నాయి. ప్రజల్లో నెలకొన్న భయాలను తొలగించడానికి ప్రధానమంత్రి మొదలుకుని..ముఖ్యమంత్రులు, సినీ స్టార్స్ మొదలుకుని క్రీడాకారుల వరకు టీకాలను తీసుకుంటున్నారు. ప్రజల్లో నెలకొన్న అరకొర భయాందోళనలను పోగొడుతున్నారు. ఈ విషయంలో వయోధిక వృద్ధులు సైతం ముందడుగు వేస్తోన్నారు.

కరోనా వ్యాక్సిన్ల కొరత: జగన్ సర్కార్ సంచలన నిర్ణయం: ఒకట్రెండు రోజుల్లోకరోనా వ్యాక్సిన్ల కొరత: జగన్ సర్కార్ సంచలన నిర్ణయం: ఒకట్రెండు రోజుల్లో

ఒక డోసు వ్యాక్సిన్ తీసుకోవడానికే వెనుకాడుతోన్న ఈ పరిస్థితుల్లో ఇటలీకి చెందిన ఓ మహిళకు ఏకంగా ఆరు డోసుల వ్యాక్సిన్ ఎక్కించేశారు హెల్త్ వర్కర్లు. అది ఫైజర్-బయోఎన్‌టెక్ వ్యాక్సిన్. పొరపాటున ఆ మహిళకు ఆరు డోసుల వ్యాక్సిన్‌ను ఎక్కించారు. అనంతరం తప్పు తెలుసుకున్నారు. ఆమెను వెదికి పట్టుకుని మరీ.. ఆసుపత్రిలో అబ్జర్వేషన్‌లో ఉంచారు. ఇటలీలోని టుస్కానీలో ఈ ఘటన చోటు చేసుకుంది.

A 23-year-old woman in Italy was given six doses of Pfizer Covid19 vaccine

23 సంవత్సరాల ఆ మహిళ స్థానిక నోవా ఆసుపత్రిలో సైకలాజికల్ డిపార్ట్‌మెంట్‌లో ఇంటర్న్‌షిప్ చేస్తోన్నారు. రెండురోజుల కిందట ఆమెకు ఫైజర్ వ్యాక్సిన్ ఇచ్చారు. ఇంటర్న్‌షిప్ స్టూడెంట్ కావడంతో ఆ ఆసుపత్రిలోనే పనిచేస్తోన్న హెల్త్ వర్కర్‌ ఆమెతో మాటలు కలిపారు. మాటల్లో పడి బోటిల్‌లో ఉన్న ఇంజెక్షన్ మొత్తాన్నీ సిరంజిలోకి తీసుకుని.. ఆ శరీరంలోకి ఎక్కించేశారు. ఆరు డోసుల వ్యాక్సిన్ ఉన్న ఫైజర్ బోటిల్ అది. వ్యాక్సిన్ తీసుకున్న అనంతరం ఆ మహిళ ఇంటికెళ్లి పోయారు.

Recommended Video

Twitter Donated 15M $ To India | Covid 19 | Jack Dorsey || Oneindia Telugu

సుమారు రెండు గంటల తరువాత- అసలు విషయం తెలిసి హెల్త్ వర్కర్లు నాలిక్కరచుకున్నారు. ఆమెను వెదికి పట్టుకుని మరీ ఆసుపత్రిలో చేర్చారు. 24 గంటల పాటు అబ్జర్వేషన్‌లో ఉంచారు. అన్ని డోసుల వ్యాక్సిన్ ఒకేసారి తీసుకున్నప్పటికీ ఆమె శరీరంలో ఎలాంటి మార్పులు కనిపించలేదు. సైడ్ ఎఫెక్ట్స్ లేవు. అనారోగ్యానికి గురి కాలేదు. పూర్తి ఆరోగ్యంతో ఉన్నారు. దీనితో ఆమెను ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. ఆమె ఆరోగ్యం బాగుండటంతో అబ్జర్వేషన్ అనంతరం డిశ్చార్జ్ చేసినట్లు ఆసుపత్రి ప్రతినిధి డేనియెల్లా గియానెల్లి తెలిపారు. ఆరు డోసులను ఒకేసారి ఎక్కించడం మానవ తప్పిదంగా అభివర్ణించారు.

English summary
A 23-year-old woman in Italy was given six doses of Pfizer-BioNTech COVID-19 vaccine due to a mistake by the health worker administering the vaccine. The woman, an intern in psychology department of Noa hospital in Tuscany where she was administered the shot.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X