వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అయిదేళ్ల చిన్నారి కిడ్నాప్: ట్రావెల్ బ్యాగులో కుక్కి పట్టుకెళ్లిన దుండగుడు

|
Google Oneindia TeluguNews

దుబాయ్: అభం శుభం తెలియని ఓ అయిదేళ్ల చిన్నారిని కిడ్నాప్ చేశాడో దుండుగుడు. ఆ చిన్నారిని గుడ్డలు కుక్కినట్లు ఓ ట్రావెల్ బ్యాగ్ లో పడేసి పట్టుకెళ్లాడు. ఊరు దాటాడు.. దేశమే దాటేశాడు. విమానాశ్రయంలో దిగిన తరువాత అక్కడి భద్రతా అధికారుల చేతికి చిక్కాడు. ఆ కిడ్నాపర్ ప్రవర్తన పట్ల అనుమానం వచ్చిన విమానాశ్రయ అధికారులు తనిఖీ చేయగా.. ఆ చిన్నారి కనిపించింది. వెంటనే అతన్ని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులకు అప్పగించారు. దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. పాకిస్తాన్ లోని కరాచీ నుంచి ఆ పాపను కిడ్నాప్ చేసినట్లు నిందితుడు అంగీకరించాడు. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

పాకిస్తాన్ లోని కరాచి జిన్నా అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి వచ్చిన ఆ కిరాతకుడిని ముహమ్మద్ గా గుర్తించారు. ఆ పాప వివరాలు ఇంకా తెలియరావాల్సి ఉంది. దుబాయ్ లోని అల్ మక్తౌమ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగిన అతని ప్రవర్తన అనుమానాస్పదంగా కనిపించింది.

A 5 months old Pakistani baby was kidnapped and taken to Dubai in a hand carry bag

బ్యాగును తన వెంటే ఉంచుకోవడం, అందులో నుంచి చిన్నారి ఏడుపు వినిపించడంతో తోటి ప్రయాణికులు సైతం ముహమ్మద్ పై భద్రతా సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వెంటనే అతణ్ని అదుపులోకి తీసుకుని తనిఖీ చేయగా.. బ్యాగులో చిన్నారి క్షేమంగా కనిపించింది. కరాచి నుంచి దుబాయ్ కు విమానంలో వెళ్లడానికి రెండు గంటలకు పైగా సమయం పడుతుంది. విమానంలో తోటి ప్రయాణికులకు అనుమానం రాలేదు. కట్టుదిట్టమైన భద్రత మధ్య ఉండే కరాచిలోని జిన్నా అంతర్జాతీయ విమానాశ్రయం సిబ్బంది కళ్లుగప్పి ఆ చిన్నారిని ఎలా దుబాయ్ వరకూ తీసుకొచ్చాడనేది ఇంకా తేలాల్సి ఉందని పోలీసులు తెలిపారు.

English summary
A 5 month old baby was kidnapped and carried to Dubai from Karachi inside a Travel Bag. It was detected at Dubai Al Maqtoum International Airport and the baby was found safe. The kidnapper took the baby from Karachi and travelled by flight reached Dubai after some hours. The baby was rescued after found her immediately in a Travel bag.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X