• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

1975 లవ్ స్టోరీ: పిల్లుల దెబ్బకు విడాకులు, భర్తకు నరకం, బెడ్ రూంలో ప్రశాంతంగా, వింటే వింతగా ఉన్నా!

|

సింగపూర్: దంపతుల మద్య ఆస్తి కోసమో, అమ్మాయిల కోసమో, కుటుంబ సభ్యుల కోసమో, అక్రమ సంబంధాల కోసమో తదితర సమస్యల కారణంగా విడాకులకు దారి తీస్తున్న విషయం తెలిసిందే. హ్యాపీగా పిల్లలతో కలిసి సంపారం చేసుకుంటున్న దంపతుల మధ్య పిల్లులు చిచ్చురేపాయి. అవి ఎంత వరకు అంటే వారి బిడ్డలు వేరుగా వెళ్లిపోవడం, దంపతులు విడాకులు తీసుకునే వరకు వెళ్లింది.

భర్తకు విడాకులైనా ఇస్తాను కాని, చచ్చినా నేను పిల్లులును మాత్రం వదిలిపెట్టనని భార్య తేల్చి చెప్పింది. ఇంట్లో బెడ్ రూంలో చోటు లేదని, కనీసం కొంపలో ఒక మూల పడుకుందాం అన్నా వీలు కావడం లేదని, ఈ మొత్తం రామాయణానికి పిల్లులే కారణం అని, నాకు విడాకులు కావాలని భర్త పట్టుబట్టాడు. మొత్తం మీద పిల్లుల పుణ్యమా అంటూ 45 ఏళ్ల సంసార జీవితానికి ఆ దంపతులు విడాకులతో చెక్ పెట్టారు.

lockdown: సూపర్ మార్కెట్ కు సూపర్ ఫిగర్లు, వలలో యజమాని, అదే పని, లేపేసిన భార్య, డ్రామా !

1975 స్వీట్ లవ్ స్టోరి

1975 స్వీట్ లవ్ స్టోరి

సింగపూర్ లో టీచర్ గా పని చేస్తున్న మహిళ, ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న ఓ వ్యక్తి 1975లో వివాహం చేసుకున్నారు. పెళ్లి జరిగిన తరువాత దంపతులు చాలా సంతోషంగా ఉన్నారు. ఈ దంపతులకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. కొన్ని సంవత్సరాల పాటు దంపతులు లక్షణంగా ఉద్యోగాలు చేసుకుంటూ రెండు అంతస్తుల విలాసవంతమైన భవనంలో ముగ్గురు పిల్లలతో కలిసి హ్యాపీగా ఉన్నారు.

 1997లో బ్యాడ్ టైం స్టాట్

1997లో బ్యాడ్ టైం స్టాట్

హ్యాపీగా ఉంటున్న ఫ్యామిలీలో 1997లో బ్యాడ్ టైం స్టాట్ అయ్యింది. భార్య కొన్ని పిల్లులు తీసుకుని ఇంటికి వెళ్లింది. పిల్లులు ఎందుకు తీసుకు వచ్చావు అని భర్త ప్రశ్నించాడు. తన తల్లి (చనిపోయింది) రాత్రిపూట కలలోకి వస్తోందని, నువ్వు పిల్లులను పెంచుకుని వాటి మీద దయ చూపిస్తే మీ సంసారం సుఖంగా సాగిపోతుందని, మీరు చనిపోతే స్వర్గానికి వెలుతారని చెప్పిందని భార్య సమాధానం ఇచ్చింది. చనిపోయిన వారు కలలోకి వచ్చి చెబితో ఒకటో రెండో పిల్లులను తీసుకురావాలని, ఇలా కుప్పలు కుప్పలు పిల్లులను తీసుకు వస్తే ఎలా అంటూ భర్త మండిపడ్డాడు.

బెడ్ రూంలో ప్రశాంతంగా ?

బెడ్ రూంలో ప్రశాంతంగా ?

రెండు అంతస్లుల ఇంట్లో పిల్లులు ఎక్కడపడితే అక్కడ మలమూత్ర విసర్జన చెయ్యడం మొదలుపెట్టాయి. పిల్లుల రామాయణం ఎక్కువ కావడంతో భర్త తట్టుకోలేకపోయాడు. పిల్లులు చేస్తున్న రాద్దాంతం భార్యకు చెప్పినా ఆమె పట్టించుకోలేదు. చివరికి ఇంట్లో ఉన్న పిల్లలు దెబ్బకు తట్టుకోలేని భర్త కొంత కాలం బెడ్ రూంకే పరిమితం అయ్యాడు. అయినా పిల్లులు బెడ్ రూంలోకి వెళ్లి అక్కడ లేనిపోని రచ్చ చేసి ఎక్కడపడితే అక్కడ మలమూత్ర విసర్జన చెయ్యడం మొదలుపెట్టాయి.

2006లో పరారైన భర్త

2006లో పరారైన భర్త

2006లో బెడ్ రూంలో కూడా ప్రశాంతంగా ఉండటానికి వీలులేకుండా పోయిందని భర్త ఇంట్లోని ఓ మూలలో రాత్రిపూట నేల మీద చిన్న దుప్పటి వేసుకుని పడుకోవడం మొదలుపెట్టాడు. అయితే పిల్లులు భర్త నిద్రపోతున్న చోటకు వెళ్లి అతని మీద మూత్రవిసర్జన చెయ్యడం మొదలుపెట్టాయి. ఎక్కడపడితో అక్కడ పిల్లులు మలమూత్ర విసర్జన చెయ్యడమే కాకుండా రాత్రిపూట తన మీద ఉచ్చ పోస్తున్నాయని భర్త అతని భార్యకు చెప్పాడు. అయితే భర్త గురించి ఏ మాత్రం పట్టించుకోని భార్య తనకు పిల్లుల మీద దయ చూపించాలని తన తల్లి కలలో వచ్చి చెప్పిందని, నీకు ఇష్టం ఉంటే ఉండూ లేకపోతే ఇంట్లో నుంచి వెళ్లిపో అని తేల్చి చెప్పింది. పిల్లుల భాద తట్టుకోలని భర్త 2006లో ఇంటి నుంచి పారిపోయి అప్పటి నుంచి అతని బావమరిది ఇంటిలో నివాసం ఉంటున్నాడు.

బ్యాంకు ఖాతాలు ఖాళీ

బ్యాంకు ఖాతాలు ఖాళీ

భార్య టీచర్ గా ఉద్యోగం చేస్తూ రిటైడ్ అయ్యింది. అప్పటికే భర్త రిటైడ్ కావడంతో అతని బ్యాంకు ఖాతాలో భారీ మొత్తంలో డబ్బులు ఉన్నాయి. పిల్లుల పెంపకం కోసం భర్త అకౌంట్ లో ఉన్న డబ్బులను భార్య ఖాళీ చేస్తూ వచ్చింది. ఇంట్లో నుంచి వచ్చేసినా భార్య పిల్లుల పెంపకం కోసం అయిన డబ్బులు అంతా తగలేస్తుందని ఆరోపిస్తూ భర్త కోర్టును ఆశ్రయించాడు. తనకు వెంటనే విడాకులు ఇచ్చేయాలని ఆ భర్త కోర్టులో జరిగిన విషయం మొత్తం చెప్పాడు. పిల్లుల దెబ్బకు తన బతుకు రోడ్డు మీద పడిందని భర్త కోర్టులో లబోదిబో అన్నాడు.

నాకు భర్త వద్దు, పిల్లులే ముద్దు

నాకు భర్త వద్దు, పిల్లులే ముద్దు

సింగపూర్ లోని జిల్లా ఫ్యామిలీ కోర్టు న్యాయమూర్తి షేక్ ముస్తాఫా వీరి విడాకుల కేసు విచారణ చేశారు. 2006 నుంచి తన భార్యతో కలిసి ఉండటం లేదని, పిల్లుల దెబ్బకు ఇంటి నుంచి పారిపోయానని భర్త కోర్టులో వాపోయాడు. భర్తకు విడాకులైనా ఇస్తానని, పిల్లులను మాత్రం తాను వదులకోనని భార్య కోర్టులో తేల్చిచెప్పింది. ఇన్ని సంవత్సరాలు వేర్వేరుగా బతుకుతున్న దంపతులు విడాకులు తీసుకోవాలని నిర్ణయించడంతో న్యాయమూర్తి షేక్ ముస్తాఫా వారికి నచ్చచెప్పడానికి ఇంతకాలం అనేక ప్రయత్నాలు చేశారు. అయితే దంపతులు వారి పట్టువిడవకపోవడంతో సోమవారం దంపతులకు కోర్టు విడాకులు మంజూరు చేసింది.

పిల్లుల దెబ్బకు 45 ఏళ్ల కాపురం మటాష్

పిల్లుల దెబ్బకు 45 ఏళ్ల కాపురం మటాష్

పిల్లుల దెబ్బకు విడాకులు తీసుకున్న భర్తకు ప్రస్తుతం 70 ఏళ్లు. 45 ఏళ్ల వీరి వైవాహిక జీవితం కేవలం పిల్లుల వలన విడాకులకు దారి తీసింది. న్యాయమూర్తి షేక్ ముస్తాఫా ఆయన తీర్పు కాఫీలో దంపతుల పేర్లు ఎక్కడా రాయలేదని, కేవలం భార్య, భర్త అని మాత్రమే రాశారని, వారి పేర్లు వెళ్లడించకూడదని న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారని సింగపూర్ మీడియా తెలిపింది.

English summary
A 70-year-old man in Singapore divorced his wife of 45 years because of her obsession with cats. Based on District Judge Sheik Mustafa's written judgement, the couple, who were only referred to as "the husband" and "the wife", were married in May 1975. They have three children and lived in a two-storey terrace house, which eventually became their matrimonial home. However, they have not lived together since 2006.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X