వింత: ప్రాస్టిట్యూట్ టెస్టర్ జాబ్స్ ఇన్ జర్మనీ (ఫోటోలు)
బెర్లీన్: వినడానికి వింతగా ఉన్నా ఇది చాల వింతైన ఉద్యోగాల కోసం ఓ సోషల్ మీడియా ప్రటన జారీ చేసింది. ఇలాంటి ఉద్యోగాలు ఇస్తామని ఇప్పటి వరకు ప్రపంచంలోని ఏ దేశంలోని కంపెనీలు ధైర్యం చెయ్యలేదు.
అయితే జర్మనీలోని ఓ వెబ్ సైట్ నిర్వహకులు ‘ప్రాస్టిట్యూట్ టెస్టర్' అనే ఉద్యోగాలు ఉన్నాయని, ఆసక్తి ఉన్నవారు సంప్రదించాలని ప్రకటన ఇచ్చేశారు. ఈ ఉద్యోగాలు చేసే వారు వ్యభిచారుల వద్దకు వెళ్లి వారి పనితనం చూసి వారికి ఓ రేటింగ్ ఇవ్వవలసి ఉంటుంది.
అంతే కాకుండ సినిమా రివ్యూ రాసినట్లు ఆ వ్యభిచారుల గురించి పూసగుచ్చినట్లు రాసి వెబ్ సైట్ లో పోస్టు చెయ్యవలసి ఉంటుందని వెరైటీ ప్రకటన ఇచ్చింది. ఈ ఉద్యోగాలకు మగవాళ్లే కాదు, ఆడవాళ్లు అర్హులే అంటూ పూర్తి సమాచారాన్ని ఇచ్చింది.
వింత: ప్రాస్టిట్యూట్ టెస్టర్ జాబ్స్ ఇన్ జర్మనీ (ఫోటోలు)
జర్మనీలో చట్టబద్ధంగా వ్యభిచారం చెయ్యవచ్చు. అక్కడి ప్రభుత్వం అందుకు అనుమతి ఇచ్చింది. అక్కడ ఫిమేల్, మేల్ ప్రాస్టిట్యూట్ లకు భలే గిరాకి ఉంది. ఈ విషయంపై కొంత కాలంగా పూర్తి వివరాలు సేకరించిన కౌఫ్ మచ్ డాట్ కామ్ అనే వెబ్ సైట్ ఈ వింత ఉద్యోగాలను తెరమీదకు తీసుకు వచ్చింది.
వింత: ప్రాస్టిట్యూట్ టెస్టర్ జాబ్స్ ఇన్ జర్మనీ (ఫోటోలు)
అడల్ట్ ఇండస్ట్రీ గురించి పూర్తి సమాచారాన్ని ఎప్పటికప్పుడు విటులకు అందచెయ్యడానికి ప్లానే చేసింది. ఈ ఉద్యోగాలు చేసే వారు వ్యభిచారులతో (ఆడ లేదా మగ) సెక్స్ లో పాల్గోనాలి. తరువాత వారి శుభ్రత, ఆరోగ్యం, సర్వీస్ గురించి పూర్తి వివరాలు సేకరించాలి.
వింత: ప్రాస్టిట్యూట్ టెస్టర్ జాబ్స్ ఇన్ జర్మనీ (ఫోటోలు)
సెక్స్ వర్కర్ల నైపుణ్యం కూడా తెలుసుకోవాలి. ఈ పూర్తి వివరాలు సేకరించిన తరువాత రివ్యూ రాసి దానికి రేటింగ్స్ పెట్టి వెబ్ సైట్ లలో పోస్టు చెయ్యవలసి ఉంటుంది. అందుకు ఆకర్షణీయమైన జీతాలు ఇస్తామని కౌఫ్ మిచ్ డాట్ కామ్ ( kaufMich.com)అధినేత బెన్ వెల్లడించారు.
వింత: ప్రాస్టిట్యూట్ టెస్టర్ జాబ్స్ ఇన్ జర్మనీ (ఫోటోలు)
ఈ ఉద్యోగాలు చెయ్యడానికి కనీసం డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. అంతే కాకుండ సంపూర్ణ ఆరోగ్యవంతులై ఉండాలని, జర్మన్, ఫ్రెంచ్ భాషలు తప్పకుండా తెలిసి ఉండాలనే నియమాలు పెట్టామని బెన్ వివరించారు.
వింత: ప్రాస్టిట్యూట్ టెస్టర్ జాబ్స్ ఇన్ జర్మనీ (ఫోటోలు)
జర్మనీలో సెక్స్ ఇండస్ట్రీని కూడా ఇతర రంగాలకు సమానంగా గుర్తింపు తీసుకురావడానికి ఈ ఉద్యోగాలకు ప్రకటనలు ఇస్తున్నామని బెన్ చెప్పారు. ఇప్పటికే దాదాపు 200 అప్లికేషన్స్ వచ్చాయని, జర్మనీతో పాటు బ్రిటన్, బెల్జియం, నెదర్లాండ్స్ నుంచి ఉద్యోగాలు చెయ్యడానికి ఆసక్తి చూపిస్తున్నారని బెన్ వివరించారు.