• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

గర్ల్ ప్రెండా...? గర్ల్ ఘోస్టా...? ప్రేమికుల రోజున పాపం వాన్ని 52 చెంప దెబ్బలు కొట్టింది

|

చైనాలో ఓ ప్రియురాలు తాను అడిగిన గిఫ్ట్ను ఇవ్వలేదని ప్రియున్ని వాలెంటైన్ డే రోజునే ,అందరూ చూస్తూండగానే నడి రోడ్డుపై ఒకటి కాదు రెండు కాదు ఏకంగా యాబై రెండు చెంప దెబ్బలు కొట్టింది. అయితే ప్రియురాలు అన్ని దెబ్బలు కొడుతున్న ప్రియుడు మాత్రం కిమ్మనకుండా నిలబడ్డాడు. ఇది చూసి మధ్యలో వెళ్లిన పోలీసులకు సైతం వారించాడు. తనను ప్రియురాలు అలా కొట్టడం వల్లే ఆమె కోపం తగ్గుతుందని పోలీసులకు కూల్‌గా చెప్పాడు.

చైనాలో ప్రేమికుల రోజు..ప్రియురాలికి కోపం..ప్రియుడికి శాపం

చైనాలో ప్రేమికుల రోజు..ప్రియురాలికి కోపం..ప్రియుడికి శాపం

చైనాలో ప్రత్యేకంగా మే 20న వాలైంటైన్ డే జరుపుకుంటారు. మే 20 అనేది 520 సంఖ్యగా మారిన నేపథ్యలో ఆరోజున చైనీస్ బాషలో ఐ లవ్ యూ అనే అర్థం వస్తుంది. దీంతో గత సోమవారం చైనాలో ప్రేమికుల రోజును జరుపుకున్నారు.ఆరోజున చైనాలోని సియాచిన్ ప్రావిన్స్‌లో ఓ ప్రేమికురాలు తన ప్రియున్ని ఒక విలువైన ఫోన్‌ను గిఫ్టుగా ఇవ్వాలని అడింగింది. దీంతో ప్రియడు దాన్ని కొనివ్వలేక పోయాడు. ఈనేపథ్యంలోనే ప్రియురాలికి పట్టరాని కోపం వచ్చింది. వెంటనే ప్రియున్ని అందరు చూస్తుండానే నడి రోడ్డుపై ఏకంగా 52 సార్లు చెంపదెబ్బలు వాయిచింది.

 ప్రేమంటే ఇదేనంటూ చూపించిన ప్రియుడు

ప్రేమంటే ఇదేనంటూ చూపించిన ప్రియుడు

అయితే అన్నిసార్లు ప్రియురాలు చెంపలు వాయిస్తున్నా..ప్రియుడు మాత్రం కిమ్మనకుండా నిలబడ్డాడు. అయితే ప్రియున్ని అన్నిసార్లు నడి రోడ్డుపై తిట్టుకుంటూ చెంపలు వాయిస్తున్న దృశ్యాన్ని అక్కడే ఉన్న పోలీసులు చూశారు. ఆమేను వారిద్దామని అక్కడకు వెళ్లారు. కాని పోలీసులకు షాక్ తగిలింది. ప్రియురాలిని ఏమీ అనకుండా చూసుకున్నాడు.తన వల్ల తప్పు జరిగిందని , తాను అలా కొట్టడం వల్ల ఆమే టెంపర్ తగ్గుతుందని కూల్‌గా చెప్పాడు. దీంతో పోలీసులు కూడ ఏమి చేయలేని పరిస్థితి.

భవిష్యత్‌లో ఇలా చేయకుడదంటూ పోలీసుల క్లాస్...

భవిష్యత్‌లో ఇలా చేయకుడదంటూ పోలీసుల క్లాస్...

కాగా ఈ దృశ్యాలను కెమారాలు బంధించాయి. ఇక ఇద్దరిని పబ్లిక్ ప్రాంతం నుండి తప్పించి పోలీసు స్టేషన్‌కు తీసుకువెళ్లారు.వాళ్ల వివాదానికి ఫుల్‌స్టాప్ పెట్టాలని ప్రయత్నించారు. ఇంకోసారి ఇలా రీపీట్ కాకుండా ఉండాలని హెచ్చరించారు. ఇలా చాల సార్లు ప్రియుడు ఆమేకు గిఫ్టులు కొనిచ్చినట్టు అక్కడి లోకల్ మీడియాలో వార్తలు వెలువడ్డాయి. మొత్తం మీద వాలైంటైన్ రోజున ప్రేమీకులు ఏది చేసుకున్న అది ఇతరులకు షాకింగ్ న్యూస్ అవుతుంది తప్ప ఇద్దరు మళ్లి తిరిగి ఒక్కటవుతారనే విషయం ఈ సంఘటనతో అర్ధమవుతుంది.

English summary
a man being slapped in the face literally dozens of times by his girlfriend who was angry over not being gifted a new smartphone for ''Valentine’s Day” in china
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X