వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రచండ భానుడినే ఢీ కొట్టే సాహసం: దూసుకొస్తోన్న అతి భారీ తోకచుక్క: కళ్లు చెదిరే వేగం

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: అంతే తెలియని అంతరిక్షంలో మరో అద్భుత ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది.ఓ భారీ తోకచుక్క మన సౌర వ్యవస్థలోకి ప్రవేశించింది. ఇప్పటికే అది నెప్ట్యూన్‌ను దాటేసింది. కళ్లు చెదిరే వేగంతో దాని ప్రయాణం సాగుతోంది. ఇంకొద్ది రోజుల్లో శనిగ్రహాన్ని చుట్టేయబోతోంది. అక్కడి నుంచి నేరుగా అది సూర్య భగవానుడి వైపునకు దూసుకెళ్తుంది. మన భూగ్రహం మీదుగా అది ప్రయాణిస్తుంది. చూడ్డానికి సిగరెట్ రూపంలో ఉంటుంది. ముందు మండుతోన్న అగ్నిగోళం.. దాని వెనుక తోకతో.. ఊహకు అందని వేగంతో అది మన సౌర వ్యవస్థలో చక్కర్లు కొడుతోంది.

తోకచుక్క పొడవు ఎంత.. వేగం ఎంత?

తోకచుక్క పొడవు ఎంత.. వేగం ఎంత?

2014లో తొలిసారిగా ఈ తోకచుక్కను గుర్తించారు అంతరిక్ష పరిశోధకులు. అందుకే దానికి 2014 యూఎన్271 (2014 UN271)గా నామకరణం చేశారు. 2018లో అది మన సౌర వ్యవస్థలోకి ప్రవేశించినట్లు అంచనా వేస్తోన్నారు. 2014 నుంచి 2018 మధ్యకాలంలో శాస్త్రవేత్తలు నిర్వహించిన డార్క్ ఎనర్జీ సర్వే సందర్భంగా దాని ఉనికి వెలుగులోకి వచ్చింది. క్రమంగా సూర్యుడి వైపు ప్రయాణిస్తోందని లెక్క గట్టారు. తన ఈ జర్నీలో ఆ తోకచుక్క ఇప్పటికే నెప్ట్యూన్ గ్రహాన్ని దాటేసింది. దాని వేగం గంటకు 92,000 కిలోమీటర్లు. దాని పొడవు 100 నుంచి 370 కిలోమీటర్లు. ఒక తోకచుక్క ఈ సైజులో ఉండటం అసాధారణమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

నిక్ నేమ్ ఏదైనా ఉందా?..దానికి అర్థమేంటి?

నిక్ నేమ్ ఏదైనా ఉందా?..దానికి అర్థమేంటి?

ఈ తోకచుక్కకు మరో ముద్దు పేరు కూడా పెట్టారు పరిశోధకులు. ఓవుమువామువా (Oumuamua). అంటే- సుదూర ప్రాంతం నుంచి వచ్చిన మొట్టమొదటి సందర్శకుడు అని అర్థం. ఈ పేరు పెట్టింది హవాయియన్లు. సందర్భానుసారంగా ఈ పేరు పెట్టారు. ఎక్కడో విశ్వాంతరాల మధ్య..నక్షత్రాల సమూహాల నుంచి దూసుకొచ్చిన ఓ తోకచుక్క మన సౌరవ్యవస్థలోకి ప్రవేశించడం ఇదే తొలిసారి కావడం వల్ల దానికి ఆ పేరు పెట్టారు. అసాధారణ స్థితిలో, అతి భారీ పరిమాణంలో ఉండటం వల్ల దీన్ని ఓ డ్వార్ఫ్ ప్లానెట్‌గా గుర్తించారు.

సూర్యుడిని ఎప్పుడు చేరుకుంటుంది?

సూర్యుడిని ఎప్పుడు చేరుకుంటుంది?

ఈ తోక ఇప్పుడు ప్రయాణిస్తోన్న గంటకు 92,000 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తే- సూర్యుడిని చేరడానికి కనీసం 10 సంవత్సరాలు పడుతుంది. అంటే 2031లో అది సూర్యుడికి అతి సమీపానికి వెళ్తుంది. ప్రస్తుతం శనిగ్రహ కక్ష్యకు అత్యంత సమీపంలో ఉందీ తోకచుక్క. కొద్దిరోజుల్లోనే తోకచుక్క కక్ష్యలోకి ప్రవేశిస్తుంది. ఆ తరువాత సూర్యుడి వైపు దూసుకెళ్తుంది. సూర్యుడికి సమీపించిన సమయంలో- అక్కడి నుంచి వెలువడే వేడి వల్ల అది తన స్వరూపాన్ని కోల్పోయే అవకాశం ఉందని అంతరిక్ష పరిశోధకులు అంచనా వేస్తోన్నారు. అంటే- దీని తోకలో ఉండే వాయువులు, శకలాలు.. అన్నీ కరిగిపోవచ్చని చెబుతున్నారు.

ఆరు లక్షల ఆర్బిట్ సంవత్సరాలుగా

ఆరు లక్షల ఆర్బిట్ సంవత్సరాలుగా

2014లో తొలిసారిగా ఈ 2014 యూఎన్271 తోకచుక్కను గుర్తించినప్పుడు.. సూర్యుడికి 29 ఆస్ట్రనామికల్ యూనిట్ల దూరంలో కనిపించింది ఇది. సూర్యడు-భూగ్రహానికి మధ్య ఉన్న దూరాన్ని ఒక ఆస్ట్రనామికల్ యూనిట్‌గా పరిగణిస్తారు. సుమారు 152 మిలియన్ల కిలోమీటర్లు. ఆ తరువాత అది సూర్యమండలంలోకి ఎంట్రీ ఇచ్చింది. సూర్యుడి వైపు ప్రయాణాన్ని సాగిస్తోంది. ప్రస్తుతం సూర్యుడికి 22 అస్ట్రనామికల్ యూనిట్ల దూరంలో ఉంది. సూర్యుడికి అత్యంత సమీపం నుంచి అది దూసుకెళ్తుందని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు. అతి సమీపానికి వచ్చినప్పుడు సూర్యుడు-ఈ తోకచుక్క మధ్య ఉండే దూరం 1.6 బిలియన్ కిలోమీటర్లు ఉండొచ్చని భావిస్తున్నారు.

English summary
Another is its size. A big comet might be 50 kilometers wide (the size of the famous Hale-Bopp comet which visited the inner solar system in the 1990s). This one may be — and I’m still reeling from this — a staggering 200 kilometers wide.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X