వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Bonus: ఉద్యోగులకు కోట్లలో బోనస్.. వచ్చి సంచులు నింపుకపోవుడే..!

చైనాలోని ఓ కంపెనీ తమ ఉద్యోగులకు రూ.73 కోట్లను బోనస్ గా ఇచ్చింది.

|
Google Oneindia TeluguNews

సాధారణంగా ఏదైనా కంపెనీలో పని చేసే ఉద్యోగులకు బోనస్ ఎంత ఇస్తారు.. ఒక నెల జీతం లేదా రెండు నెలల జీతం.. ఇంకా అంటే 6 నెలల జీతం బోనస్ గా ఇస్తారు. కానీ ఓ కంపెనీ తమ ఉద్యోగులకు కోట్లల్లో బోనస్ ఇచ్చింది. ఆ బోనస్‌లను ఉద్యోగుల అకౌంట్‌లలో డిపాజిట్ చేయకుండా నేరుగా క్యాష్‌ రూపంలో చేతికి ఇచ్చింది. ఆ డబ్బు తీసుకునేందుకు ఉద్యోగులు బ్యాగులు పట్టుకు రావడం, వరుసగా పేర్చిన డబ్బుల కుప్పులో నుంచి నోట్ల కట్టల్ని బ్యాగుల్లో వేసుకునే దృశ్యాలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

61 మిలియన్ యువాన్లు

61 మిలియన్ యువాన్లు

చైనాలోని ఒక కంపెనీ ఒక పార్టీలో వేదికపై నగదును గుట్టలుగా పోసింది. పార్టీకి వచ్చిన ఉద్యోగులకు లక్షలాది యువాన్‌లను బోనస్‌గా అందజేసింది. సెంట్రల్ చైనాలో ఉన్న క్రేన్ తయారీదారు హెనాన్ మైన్ కంపెనీ వార్షిక పార్టీలో దాదాపు రెండు మీటర్ల ఎత్తులో 61 మిలియన్ యువాన్ల (రూ. 73,78,48,939) నోట్లలో పేర్చింది. అత్యుత్తమ పనితీరు కనబరిచిన ముగ్గురు సేల్స్ మేనేజర్లు ఒక్కొక్కరికి ఐదు మిలియన్ యువాన్ల (రూ. 6,04,60,138) టాప్ రివార్డును ఇచ్చింది.

30 మందికి పైగా

30 మందికి పైగా

మరో 30 మందికి పైగా ఒక మిలియన్ యువాన్ (రూ. 1,20,91,847) బోనస్ ఇచ్చింది." మేము జనవరి 17 రాత్రి సేల్స్ ఇయర్-ఎండ్ మీటింగ్‌ని నిర్వహించాము. మొత్తం 61 మిలియన్ యువాన్‌లను 40 సేల్స్ మేనేజర్‌లకు ఇచ్చాము" అని వ్యక్తి SCMPకి చెప్పారు. అంతే కాదు, నిర్ణీత సమయంలో ఎన్ని 100-యువాన్ బిల్లులను లెక్కించవచ్చో చూసేందుకు ఉద్యోగులు పోటీ పడ్డారు. బోనస్ డబ్బు తీసుకోవడానికి ఉద్యోగులు బ్యాగులు పట్టుకుని వచ్చి.. బ్యాగుల్లో డబ్బులు తీసుకెళ్లారు.

2002లో

2002లో

ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. హెనాన్ మైన్ కంపెనీ 2002లో స్థాపించారు. కంపెనీలో 5,100 కంటే ఎక్కువ మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. కంపెనీ 2022లో 9.16 బిలియన్ యువాన్ల (రూ. 1,10,75,56,08,359) ఆదాయాన్ని నమోదు చేసింది. ఇది గత సంవత్సరంతో పోలిస్తే 23 శాతం పెరిగింది. గత మూడేళ్లుగా కంపెనీలో ఉద్యోగులను తొలగించలేదు.

English summary
Generally how much bonus is given to the employees working in any company.. One month salary or two months salary.. Also 6 months salary is given as bonus. But a company gave bonus in crores to its employees.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X