వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'గూగుల్'లో ముదురుతోన్న వివాదం: వేల సంఖ్యలో ఉద్యోగుల రాజీనామా?

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: అమెరికా రక్షణ విభాగంతో చేతులు కలిపి గూగుల్ చేపట్టిన 'ప్రాజెక్ట్ మావేన్'కు గట్టి షాక్ తగిలింది. సంస్థ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వేల సంఖ్యలో ఉద్యోగులు రాజీనామాలకు సిద్దపడుతున్నారు. అధికారికంగా ఇప్పటికే 12మంది ఉద్యోగులు రాజీనామా చేసినట్టు సమాచారం. మరోవైపు గూగుల్ మాత్రం ఉద్యోగుల రాజీనామాను లెక్క చేయకుండా.. ప్రాజెక్టుపై ముందడుగు వేస్తోంది.

వ్యతిరేకిస్తున్న ఉద్యోగులు

వ్యతిరేకిస్తున్న ఉద్యోగులు

ప్రాజెక్టు విషయానికొస్తే.. అమెరికా సైన్యం అవసరాల కోసం డ్రోన్‌ టెక్నాలజీని ఉపయోగించి గగనతలం నుంచి గూగుల్ ఫోటోలు తీయడం ఈ ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశం. అయితే ఆ ఫోటోల్లోని మనుషులను ఆటోమేటిగ్గా వేరు చేసి చూపించే వ్యవస్థ కూడా ఇందులో అనుసంధానమై ఉంది. దీంతో గూగుల్ ఉద్యోగులు దీన్ని వ్యతిరేకిస్తున్నారు.

4వేల మంది రాజీనామా?

4వేల మంది రాజీనామా?

ఇది విలువలకు తిలోదకాలు ఇవ్వడమేనని ఉద్యోగులు వాదిస్తున్నారు. మనుషుల కంటే మెషీన్స్ కు ఎక్కువ విలువ ఇవ్వడం, పైగా సైన్యానికి సంబంధించిన కార్యకలాపాల్లో పాలుపంచుకోవడం కంపెనీకి చెడ్డ పేరు తీసుకొస్తుందని ఉద్యోగులు వాపోతున్నారు. ఈ మేరకు 4వేల మంది ఉద్యోగులు గూగుల్ నిర్ణయానికి వ్యతిరేకంగా రాజీనామాలు చేస్తామని పేర్కొంటూ సంస్థ యాజమాన్యానికి ఓ లేఖ రాశారు.

తక్షణం తప్పుకోవాల్సిందిగా డిమాండ్

తక్షణం తప్పుకోవాల్సిందిగా డిమాండ్

తక్షణం ఈ ప్రాజెక్టు నుంచి గూగుల్ వైదొలగాల్సిందిగా ఉద్యోగులు లేఖలో పేర్కొన్నారు. ఉద్యోగుల నిరసనకు ఇంటర్నేషనల్ కమిటీ ఫర్ రోబోటిక్స్ ఆర్మ్ కంట్రోల్ కూడా మద్దతు తెలపడం గమనార్హం. ఈ మేరకు ఓ బహిరంగ లేఖ విడుదల చేసిన ఆ సంస్థ.. 'టెక్నాలజీని ఆయుధంగా వాడుకోవడం సరికాదు' అంటూ అందులో పేర్కొంది.

పట్టించుకోని గూగుల్

పట్టించుకోని గూగుల్

ఓవైపు ఈ ప్రాజెక్టుపై నిరసనలు వెల్లువెత్తుతుండగానే గూగుల్‌ పెంటగాన్‌ కంపెనీ క్లౌడ్‌ కంప్యూటింగ్‌ మాత్రం ప్రాజెక్టును దక్కించుకోవడానికి ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. ఈ నేపథ్యంలో గూగుల్ ఉద్యోగుల నిర్ణయాలకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని, సంస్థ పారదర్శకమైన నిర్ణయాలను తీసుకోవడం లేదని కొంతమంది ఆరోపిస్తున్నారు.

English summary
Despite protests from employees, Google is still charging ahead with a Department of Defense collaboration to produce machine-learning software for drones.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X