
పుతిన్-జెలెన్స్కీ ఇక ఫేస్ టు ఫేస్: ఇస్తాంబుల్ భేటీతో శరవేగంగా మారిన పరిణామాలు
వాషింగ్టన్: నెలరోజులకు పైగా రష్యా, ఉక్రెయిన్ మధ్య కొనసాగుతూ వచ్చిన భీకర యుద్ధానికి పుల్‌స్టాప్ పడినట్టే కనిపిస్తోంది. ఇప్పట్లో ఈ యుద్ధానికి అంతు అనేదే ఉండకపోవచ్చంటూ వార్తలు వెలువడుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో రష్యా.. అనూహ్య నిర్ణయాన్ని తీసుకుంది. వెనక్కి తగ్గింది. రష్యాతో వెనకడుగు వేయించడానికి పాశ్చాత్య దేశాలు చేస్తోన్న ప్రయత్నాలేవీ ఫలించనప్పటికీ- టర్కీలోని ఇస్తాంబుల్ వేదికగా సాగిన శాంతి చర్చలు కొంత ప్రభావాన్ని చూపాయి. ఈ చర్చల పాక్షికంగా సఫలం అయ్యాయి.
వెనక్కి
తగ్గిన
రష్యా:
అక్కడి
నుంచి
సైన్యం
ఉపసంహరణకు
ఓకే:
ఇస్తాంబుల్
చర్చలు
ఫలించినట్టే?

సానుకూలంగా స్పందించిన రష్యా..
ఆ అజెండాతో రష్యా-ఉక్రెయిన్ ప్రతినిధులు ఇస్తాంబుల్‌లో సమావేశం అయ్యారు. మూడు గంటలకు పైగా వారి మధ్య చర్చలు కొనసాగాయి. అవి కొంతవరకు ఫలించినట్టే కనిపిస్తోన్నాయి. రష్యా కొంత సానుకూలంగా వ్యవహరించింది. ఇదివరకు నిర్వహించిన శాంతి చర్చల సందర్భంగా ఉక్రెయిన్ ప్రతిపాదించిన అంశాలను ఏ మాత్రం పరిగణనలోకి తీసుకోని రష్యా.. తన వైఖరిని మార్చుకుంది. సానుకూలంగా వాటిని పరిశీలనలోకి తీసుకుంది.

కీవ్, చెర్నిహివ్ నుంచి..
రాజధాని కీవ్, చెర్నిహివ్ నుంచి సైనిక బలగాలను వెనక్కి తీసుకోవడానికి రష్యా అంగీకరించింది. ఈ రెండు నగరాల నుంచి తమ సైనిక బలగాలను భారీగా తగ్గిస్తామని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ ఉప మంత్రి అలెగ్జాండర్ ఫోమిన్ వెల్లడించారు. చర్చలు సుహృద్భావ వాతావరణంలో సాగాయని చెప్పారు. శాంతి చర్చలను మరింత ముందుకు తీసుకెళ్లడంలో భాగంగా- తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. పరస్పర అంగీకారంతో ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు.

ఆ ప్రతిపాదనకు రష్యా అంగీకారం..
తటస్థంగా వ్యవహరించగలిగితే- ఉక్రెయిన్‌కు సెక్యూరిటీ గ్యారంటీ ఇవ్వడానికి తాము సిద్ధంగా ఉన్నామని అలెగ్జాండర్ ఫోమిన్ స్పష్టం చేశారు. ఉక్రెయిన్ తన అజెండాకు కట్టుబడి ఉండాల్సి ఉంటుందని చెప్పారు. కీవ్, చెర్నిహివ్ నుంచి సైన్యాన్ని వెనక్కి తీసుకోవడానికి తాము అంగీకరించామని, మిగిలిన నగరాల్లో సైనిక చర్యలు యధాతథంగా కొనసాగే అవకాశాలు లేకపోలేదని ఆయన వ్యాఖ్యానించారు. ఈ సమావేశం ముగిసిన అనంతరం రష్యా ప్రతినిధులు మాస్కోకు బయలుదేరి వెళ్లారు.

త్వరలో పుతిన్-జెలెన్స్కీ ముఖాముఖి..
ఇస్తాంబుల్ వేదికగా రష్యా-ఉక్రెయిన్ మధ్య సాగిన చర్చలు సానుకూలంగా ముగిసిన నేపథ్యంలో ఇక ఈ రెండు దేశాధ్యక్షులు ముఖాముఖి భేటీకి సన్నాహాలు మొదలయ్యాయి. అంతా సవ్యంగా సాగితే- వచ్చే వారమే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్-ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్స్కీ సమావేశం కావడం ఖాయంగా కనిపిస్తోంది.. అదీ కూడా ముఖాముఖిగా. అదే జరిగిత- ఇక ఈ భీకర యుద్ధానికి బ్రేక్ పడినట్టే భావించవచ్చు.

తొలుత విదేశాంగ మంత్రులు..
పుతిన్-జెలెన్స్కీ భేటీ కంటే ముందే ఈ రెండు దేశాల విదేశాంగ మంత్రులు సమావేశమౌతారని తెలుస్తోంది. రష్యా విదేశాంగ మంత్రి సెర్గెయ్ లావ్రోవ్, ఉక్రెయిన్‌కు చెందిన తన కౌంటర్పార్ట్ దిమిత్రి కులేబాతో భేటీ అవుతారని టర్కీ వెల్లడించింది. ఇదే విషయాన్ని ఇస్తాంబుల్ శాంతి చర్చల్లో పాల్గొన్న ఉక్రెయిన్ ప్రతినిధి కూడా ధృవీకరించారు. ఈ ఇద్దరు మంత్రులు తొలుత సమావేశమౌతారని, పుతిన్-జెలెన్స్కీ భేటీకి అవసరమైన అజెండాను రూపొందించుకుంటారని పేర్కొన్నారు.