వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పాక్ ఉగ్రదాడి, వంద మందికి పైగా కాపాడిన లేడీ పోలీసు; హ్యాట్సాఫ్, ఫ్యామిలీని ఎదిరించి పోలీసు కమీషనర్!

|
Google Oneindia TeluguNews

కరాచి: పాకిస్థాన్ లో జరిగిన ఉగ్రదాడిలో వందలాది మంది ప్రాణాలు రక్షించిన లేడీ పోలీసు అధికారిని నేడు ప్రపంచం మొత్తం అభినందిస్తోంది. ప్రాణాలకు తెగించిన లేడీ పోలీసు అధికారిని ప్రజలతో పాటు చైనా రాయబారి కార్యాలయం సిబ్బందిని ప్రాణాలతో రక్షించి నేడు హాట్ టాఫిక్ గా నిలిచారు. ఒక్క మహిళా పోలీసు అధికారి సుమారు వంద మందికి పైగా ప్రాణాలు కాపాడంతో ప్రపంచం మొత్తం ఆమె వైపు చూస్తోంది.

పోలీసు కమీషనర్

పోలీసు కమీషనర్

కరాచిలో అసిస్టెంట్ పోలీసు కమీషనర్ గా సహాయ్ అజిజ్ తాల్పుర్ విధులు నిర్వహిస్తున్నారు. శుక్రవారం చైనా రాయబారి కార్యాలయం సమీపంలోని మార్కెట్ దగ్గర ఉగ్రవాదులు రిమోట్ సహాయంతో బాంబుపేలుడు సృష్టించారు. ఈ బాంబు పేలుడులో 30 మంది ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి.

లేడీ పోలీసు ఎదురుదాడి

ఉగ్రదాడి విషయం తెలుసుకున్న లేడీ పోలీసు అధికారి సుహాయ్ అజిజ్ తాల్పుర్ తన సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. చైనా రాయబారి కార్యాలయంలోకి చొరబడటానికి ప్రయత్నిస్తున్న 9 మంది ఉగ్రవాదల మీద ఎదురుదాడికి దిగారు. ఉగ్రవాదులు చైనా రాయబారి కార్యాయలంలోకి వెళ్లకుండా, ప్రజల మీద దాడి చెయ్యకుండా తన సిబ్బందితో కలిసి లేడీ పోలీసు అధికారి సుహాయ్ అజిజ్ తాల్పుర్ అడ్డుకున్నారు. ఇదే సమయంలో ముగ్గురు ఉగ్రవాదులను అంతం చేశారు. ఉగ్రవాదుల ఎదురుదాడిలో ఇద్దరు పోలీసులు ప్రాణాలు కోల్పోయారు.

సామాన్య కుటుంబం

సింధ్ ప్రాంతంలోని భాయ్ ఖాన్ తాల్పుర్ జిల్లాలో సామాన్య మధ్యతరిగి కుటుంబంలో సుహాయ్ అజిజ్ తాల్పుర్ జన్మించారు. తాను పోలీసు అధికారి అవుతానని సుహాయ్ ఆమె కుటుంబ సభ్యులు, బంధువులకు చెప్పారు. మొదటే మనం ఇస్లాం మతంలో జన్మించామని, పోలీసు కావడానికి తాము అంగీకరించమని, ఎదైనా మరో ఉద్యోగం చెయ్యాలని వారు వారించారు. అయితే సుహాయ్ అజిజ్ తాల్పుర్ మాత్రం 2013లో సెంట్రల్ సుపీరియర్ సర్వీస్ పరీక్షలు రాసి పోలీసు అధికారి ఉద్యోగం సంపాధించారు.

మహిళలకు ఆదర్శం

34 ఏళ్ల సుహాయ్ అజిజ్ తాల్పుర్ నేడు పాకిస్థాన్ లోని మహిళలకు వీరవనితగా కనిపిస్తున్నారు. పాకిస్థాన్ లో అసలే ఇంటి నుంచి బయటకు రాకుండా ఉంటున్న మహిళలు సహాయ్ అజిజ్ తాల్పుర్ ధైర్యసాహాసాలు తెలుసుకుని సంతోషంలో మునిగితేలుతున్నారు. సాటి మహిళలకు సహాయ్ అజిజ్ తాల్పుర్ ఆదర్శంగా నిలిచారని మీడియా, స్వచ్చంద సంస్థలు అంటున్నాయి.

ప్రాణాలు లెక్కలేదు

స్థానిక మీడియాతో మాట్లాడిన అస్టిస్టెంట్ పోలీసు కమీషనర్ సహాయ్ అజిజ్ తాల్పుర్ తనకు ప్రాణాలు ముఖ్యం కాదని, ఉగ్రవాదుల నుంచి ప్రజలు, చైనా రాయబారి కార్యాలయం ఉద్యోగులను కాపాడినందుకు ఎంతో సంతోషంగా ఉందని చెప్పారు. ఉగ్రదాడిని ఎంతో ధైర్యంగా ఎదుర్కొన్న లేడీ పోలీసు అధికారి సుహాయ్ అజిజ్ తాల్పుర్ సాటి సిబ్బంది దగ్గర నేడు గర్వంగా తలెత్తుకుని తిరుగుతున్నారు.

English summary
A fearless woman officer of Karachi Police saved lives of many Chinese diplomatic staff when heavily-armed terrorists stormed the mission in the Pakistani city.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X