వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాబూల్ లో భారత్, జర్మనీ ఎంబాసీ వద్ద బాంబు దాడి ! మోడీ జర్మనీ పర్యటన, టెర్రర్ టార్గెట్ !

|
Google Oneindia TeluguNews

కాబూల్: కాబూల్ లోని భారత్, జర్మనీ దౌత్య కార్యాలయాలకు అతి సమీపంలో బుధవారం ఉదయం బాంబుపేలుడు జరిగింది. భారీ శభ్దంతో బాంబుపేలుడు జరగడంతో దట్టమైన పోగలు వ్యాపించాయి. కాబుల్ నగరం నడిబోడ్డన ఈపేలుడు జరగడంతో స్థానిక ప్రజలు హడలిపోయారు.

ఈ బాంబుపేలుడు జరిగిన ప్రాంతంలోని వంద మీటర్ల పరిదిలో ఉన్న భవనాల తలుపులు, కిటికీలు, అద్దాలు ధ్వంసం అయ్యాయి. పేలుడు జరిగిన వెంటనే అదే ప్రాంతంలో ఉన్న స్థానికులు పేలుడు జరిగిన ప్రాంతాన్ని దట్టంగా వ్యాపిస్తున్న నల్లటి పోగలను ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు.

తాలిబన్, ఆల్ ఖైదా, ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు విదేశీ రాయబారి కార్యాలయాలను లక్షంగా చేసుకుని దాడులు చేశారని స్థానిక ఆర్మీ అధికారులు అనుమానం వ్యక్తం చేశారు. భారత్, జర్మనీ రాయబారి కార్యాలయాలకు కేవలం 50 మీటర్ల దూరంలో బాంబు పేలుడు జరిగింది.

భారత ప్రధాని నరేంద్ర మోడీ జర్మనీ పర్యటనలో ఉండగానే బాంబుపేలుడు జరిగింది. కాబూల్ లోని వివిధ దేశాల దౌత్యకార్యాలయాలు ఉన్న ఈ ప్రదేశానికి జర్మన్ గేట్ ముఖ ద్వారంగా ఉంటుంది. జర్మన్ గేట్ సమీపంలోనే జర్మనీ, భారత్ రాయబార కార్యాలయాలు ఉన్నాయి.

విషయం గుర్తించిన అధికారులు వెంటనే ఎంబసీ ఉద్యోగులను స్ట్రాంగ్ రూంలకు తరలించారు. ఆ పరిసర ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. రాయబార కార్యాలయాలను లక్షంగా చేసుకుని ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడి చేసి ఉంటారని స్థానిక ఆర్మీ అధికారులు అనుమానాం వ్యక్తం చేస్తున్నారు. ఈ దాడిలో ఎవ్వరూ మరణించలేదని ఆర్మీఅధికారుల ప్రాథమిక విచారణలో వెలుగు చూసింది.

English summary
A big explosion went off in the Afghan capital, Kabul, on Wednesday morning, sending clouds of black smoke spiralling over the centre of the city in an area near the presidential palace and foreign embassies.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X